కారణం అద్భుతం... పవన్ పర్సనల్ సెక్రటరీకి ప్రత్యేక అభినందనలు!
ఆయనలోని బలమైన పరిపాలనా నైపుణ్యాలను గుర్తించిన పవన్ కళ్యాణ్.. కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజను డిప్యుటేషన్ పై ఏపీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న కృష్ణ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేరళ కేడర్ కు చెందిన ఈ ఐఏఎస్ అధికారిని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కోరి డిప్యుటేషన్ పై ఏపీకి తీసుకొచ్చారు. ఈ సమయంలో కృష్ణ తేజ గురించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... ఆయనలోని బలమైన పరిపాలనా నైపుణ్యాలను గుర్తించిన పవన్ కళ్యాణ్.. కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజను డిప్యుటేషన్ పై ఏపీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు పవన్ కు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ తో ఆకట్టుకోగా.. తాజాగా ఆయనలోని సేవా దృక్పథం ఆసక్తిగా మారింది.
వివరాళ్లోకి వేళ్తే... 2022లో కోవిడ్-19 సంక్షోభ సమయంలో కేరళలోని అలప్పుజ జిల్లా కలెక్టర్ పనిచేశారు కృష్ణ తేజ. ఇక ఈ మహమ్మారి ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికించిందో.. ఎన్నో కుటుంబాలను ఏ విధంగా ఛిన్నాభిన్నం చేసిందో అందరికీ తెలిసిందే. అందుకు అలప్పుజ జిల్లా అతీతమేమీ కాదు. ఈ క్రమంలో.. అక్కడ సుమరు 292 మంది పిల్లలు అనాథలయ్యారు.
ఈ మహమ్మారి కారణంగా.. 292 మంది పిల్లలు తల్లితండ్రులను కోల్పోయారు. ఈ సమయంలో.. వారి బాధలను ప్రత్యక్షంగా చూసిన కృష్ణతేజ.. జిల్లా కలెక్టర్ గా, సాధారణ పౌరుడిగా.. తన పదవితో సంబంధం లేకుండానే ఈ పిల్లలకు విద్యను, దానితోపాటు ఇళ్లను కూడా అందించాలని ధ్యేయంగా, లక్ష్యంగా పెట్టుకున్నారట.
ఈ సమయంలో ముందుగా విద్య విషయంలో... స్కూల్స్, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవడం ద్వారా మొదటి లక్ష్యాన్ని మొదలుపెట్టారు. అనంతరం నెక్స్ట్ టార్గెట్ ఇళ్ల నిర్మాణం విషయంలో ఆయన దృష్టిసారించారట. ఈ సమయంలో.. ప్రభుత్వ వనరుల నుంచి గణనీయమైన సహకారాన్ని అందించారు!
ఇదే సమయంలో ఆ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మిగిలిన నిధులను సేకరించే బాధ్యతను స్వయంగా తీసుకున్నారు. ఈ సమయంలో... తన స్నేహితులు, సహోద్యోగులు, బంధ్వులు, పరిచయస్తుల నుంచి విరాళాలు సేకరించారు. ఈ సమయంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఫైనల్ గా 292 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించారు.
ఈ క్రమంలో... 286 ఇళ్లల్ను ఇప్పటికే అప్పగించిన ఆయన.. తాజాగా మిగిలిన ఆరు ఇళ్లను శనివారం పూర్తి చేసి అప్పగించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ ఇళ్ల ఫోటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. కృష్ణతేజను అభినందించడం మొదలుపెట్టారు. అద్భుతమైన వ్యక్తి అని ఒకరంటే.. ఆయన్ను మనస్పూర్తిగా అభినందించడానికి ఇదొక అద్భుతమైన కారణమని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.