అదానీ తెలంగాణలో పెట్టుబడులు పెడతానంటే వద్దని చెప్పాలా కేటీఆర్?

ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో తాను వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఉంటూ.. అర్థం లేని విమర్శలు చేస్తున్న కేటీఆర్ తాజాగా ఆ తరహాలోనే మరో వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

Update: 2024-01-19 03:55 GMT

ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో తాను వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఉంటూ.. అర్థం లేని విమర్శలు చేస్తున్న కేటీఆర్ తాజాగా ఆ తరహాలోనే మరో వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. మహబూబ్ గనర్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహాక సమావేశాన్ని నిర్వహించిన కేటీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికలకు ముందు అదానీని దొంగ అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారని.. ఆయన దోచిన రూ.13లక్షల కోట్లు ప్రధానికి.. బీజేపీకి వెళతాయని విమర్శించి.. ఇప్పుడు దావోస్ లో ఆయన్ను ఎలా కలుస్తారని? ప్రశ్నించారు.

మోదీ.. అదానీ ఒకటేనని రాహుల్ గాంధీ, రేవంత్ లు చాలాసార్లు చెప్పారన్న ఆయన.. దేశానికి అదానీ శత్రువు అంటూ ఢిల్లీలో కొట్లాడుతున్న కాంగ్రెస్.. ఇక్కడ మాత్రం ఆయనతో ఎందుకు కలిసి పని చేస్తుందో చెప్పాలన్న కేటీఆర్ మాటలు చూస్తే.. చాక్లెట్ చేజారిపోతే ఏడ్చే పిల్లాడి మాదిరి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయం వేరు.. వ్యాపారం వేరన్న చిన్న విషయాన్ని ఆయన ఎలా మిస్ అవుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న అదానీకి నో చెప్పాలా? అన్నది ప్రశ్న. విధానాల పరంగా సవాలచ్చ పంచాయితీలు ఉండొచ్చు. కానీ.. అవేమీ రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డంకిగా మారకూడదు. పెట్టుబడులు పెట్టే వారిని.. వ్యాపారుల మాదిరే చూస్తారు కానీ.. మరోలా చూడాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. ఆంధ్రా పెత్తందారుల కారణంగా తెలంగాణ నష్టపోయిందని అదే పనిగా వాదనలు వినిపించిన కేసీఆర్, కేటీఆర్ లు తాము పదేళ్ల పాలనలో ఉన్నప్పుడు ఇచ్చిన కాంటాక్టుల్లో అత్యధికంగా ఆంధ్రాకు చెందిన వారికే అన్నది నిజం. మరి.. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? వారికి ప్రాజెక్టులు ఇవ్వకుండా ఆంధ్రాకు చెందిన వారికే ఎందుకు ఇచ్చారు? అన్న ప్రశ్నకు కేటీఆర్ ఎప్పుడైనా సమాధానం చెప్పారా?

కాంట్రాక్టులు ఇచ్చేందుకు అభ్యంతరం లేని వేళ.. వేలాది కోట్ల రూపాయిలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమై.. తెలంగాణకు వస్తామంటే.. నో చెప్పాలా? అన్నదిప్పుడు ప్రశ్న. నిత్యం ఏదో అంశాన్ని ఎత్తి చూపుతూ.. రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడే కేటీఆర్ తీరు చూస్తే.. పస కంటే నసే ఎక్కువైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా అదానీ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణకు వస్తానంటే.. ఎందుకు వస్తున్నావ్? నువ్వు తెలంగాణలోకి అడుగు పెట్టటానికి వీల్లేదన్న మాటను కేటీఆర్ ఆశిస్తున్నారా? అన్నది ప్రశ్న.

Tags:    

Similar News