కవిత 11 కేజీల బరువు తగ్గారు.. పరిస్థితిని వివరించిన కేటీఆర్!

ప్రస్తుతం బీఆరెస్స్ శ్రేణుల్లోనే ఇదే చర్చ జరుగుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి వివరాలు వెల్లడించారు కేటీఅర్.

Update: 2024-08-09 12:16 GMT

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనకు రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు వ్యక్తుల షూరిటీలతో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వ్యులిచ్చింది. అదేవిధంగా కొన్ని షరతలును విధించింది.

ఇందులో భాగంగా.. సిసోడియా తన పాస్ పోర్టును అప్పగించాలని, సాక్ష్యులను ప్రభావింతం చేయకూడదని ఆదేశించింది. సిసోడియా సుమారు 17 నెలలుగా జైల్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన సుప్రీంకోర్టు... ఏ నిందితుడినీ కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచలేరని వ్యాఖ్యానించింది. అలా కాదంటే... ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుందని వెల్లడించింది.

ఇలా సుమారు 530 రోజులుగా జైల్లో ఉన్న సిసోడియాకు బెయిల్ రావడంపై ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో... అదే కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పై ఇప్పుడు చర్చ మొదలైంది. కవితకు కూడా త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉందా.. అసలు ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశాలపైనా చర్చ మొదలైంది. ఈ సమయంలో కేటీఆర్ స్పందించారు.

అవును... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో... అరవింద్ కేజ్రీవాల్, కవిత లకు కూడా బెయిల్ వస్తుందనే భావిస్తున్నామని బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం బీఆరెస్స్ శ్రేణుల్లోనే ఇదే చర్చ జరుగుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి వివరాలు వెల్లడించారు కేటీఅర్.

ఇందులో భాగంగా... అసలు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన ఆయన... కవితకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని అన్నారు. త్వరలో బెయిల్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జైల్లో ఉన్న కవిత సుమారు 11 కిలోల బరువు తగ్గారని.. ఇదే సమయంలో బీపీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురుకోంటున్నారని కేటీఆర్ వెల్లడించారు!

Tags:    

Similar News