మల్కాజిగిరీపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

దేశంలో అసలైన సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. జై శ్రీ రాం నినాదాలు ఓట్లు రాల్చవు.

Update: 2024-04-02 11:02 GMT

దేశంలో అసలైన సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. జై శ్రీ రాం నినాదాలు ఓట్లు రాల్చవు. బీజేపీ ప్రస్తుతం అదే ఊపులో ఉందని పేర్కొన్నారు. రాముడి పేరు చెప్పి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోంది. అదే నినాదంతో ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. కానీ అదంత సులభం కాదని జోస్యం చెప్పారు. మూడోసారి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.

క్రిస్టియన్, ముస్లిం లకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చిన పార్టీ తమదేనన్నారు. జైశ్రీరాం నినాదం కడుపు నింపదని అంటున్నారు. ప్రస్తుతం అదే తమను గట్టెక్కిస్తుందని బీజేపీ భావిస్తోంది. కానీ అది వారిని ఆదుకోదనే సంగతి వారికి తెలియదు. పార్లమెంట్ లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేది, కొట్లాడేది తమ పార్టీ అని గుర్తు చేశారు. అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగానే నిలుస్తాయన్నారు.

మల్కాజిగిరిలో కాంగ్రెస్ కు అభ్యర్థి కరువయ్యారని పేర్కొన్నారు. ఇక్కడ పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంటుంది. మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ వెనకటి రోజులు వస్తున్నాయి. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టడంతో పోటీ ఇద్దరి మధ్యే నెలకొంది. పోటీ మాత్రం తీవ్రంగానే ఉంటుంది. బీజేపీతోనే తమ పోటీ అని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తన ప్రభావం చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఇంతవరకు వాటిని నెరవేర్చలేదు. అందుకే కాంగ్రెస్ కు ఓట్లు వేసే వారు లేరన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలో సమ ఉజ్జీలుగా నిలుస్తాయని చెబుతున్నారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ కు గుర్తింపు ఉండదన్నారు.

కుల, మత ప్రాతిపదికన ఓట్లు అడిగినా పడవు. మనది ప్రజాస్వామ్య దేశం. అందరు సమానంగా ఉండాలనేది మన సంప్రదాయం. ఈనేపథ్యంలో ప్రజలను విడదీసి ఓట్లు అడగడం బీజేపీ నైజం. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే సెక్యులర్ పార్టీ అని ప్రజలు గుర్తిస్తున్నారు. తమ పార్టీకి ఓట్లు రావడం గ్యారంటీ. ఇలా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News