కేటీఆర్ పుత్రోత్సాహం... అంతలోనే ఎంతఎదిగాడు!
తన కుమారుడి విషయంలో ఎప్పుడూ ఎమోషన్ అవుతూ.. సంబరపడిపోతూ కనిపించే కేటీఆర్... ఇప్పుడు మరోసారి సంబరాల్లో మునిగిపోతున్నారు.
తన కుమారుడి విషయంలో ఎప్పుడూ ఎమోషన్ అవుతూ.. సంబరపడిపోతూ కనిపించే కేటీఆర్... ఇప్పుడు మరోసారి సంబరాల్లో మునిగిపోతున్నారు. అవును... పుత్రోత్సాహము మూడ్ లో ఉన్నారంట తెలంగాణ మంత్రి కేటీఆర్! తన కుమారుడు కల్వంకుట్ల హిమాన్షు రావు కేరీర్ లో మరో ముందడుగు పడిందని సంబరపడిపోతున్నారు!
అవును... భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు కేరీర్ లో మరో ముందడుగు పడింది. ఈ మధ్యే ఇంటర్మీడియట్ ను పూర్తి చేసుకున్న హిమాన్షు.. ఉన్నత చదువుల కోసం శనివారం రాత్రి అమెరికా బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కారు. ఆయన వెంట కేటీఆర్, శైలిమ, చెల్లెలు అలేఖ్య ఉన్నారు. ఈ సమయంలో వారం రోజుల పాటు అమెరికాలో గడపనుంది కేటీఆర్ కుటుంబం. అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత స్వదేశానికి తిరిగి వస్తారు.
ఈ సమయంళ్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఫొటోను హిమాన్షు షేర్ చేశారు. "అన్ టిల్ నెక్స్ట్ టైమ్ హైదరాబాద్" అంటూ కామెంట్ యాడ్ చేశారు. తన తనయుడు అమెరికాకు వెళ్తోన్న సందర్భంగా కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తన భావాలను వివరిస్తూ ఓ ట్వీట్ చేశారు.
ఇందులో భాగంగా.. "నిన్నటి వరకు అల్లరి చేస్తూ చిన్న పిల్లవాడిగా కనిపించిన ఈ కుర్రాడు పెరిగి పెద్దవాడయ్యాడు.. అప్పుడే కాలేజీ చదివే స్థాయికి ఎదిగాడు.." అంటూ ట్వీట్ చేస్తూ... హిమాన్షు నెలల పసికందుగా ఉన్నప్పటి నుంచీ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునేంత వరకు వేర్వేరు సందర్భాల్లో తీసిన కొన్ని ఫొటోలను దానికి జత చేశారు కేటీఆర్.
కాగా... గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్ లో ఇంటర్మీడియట్ ను పూర్తిచేసుకున్నారు హిమాన్షు. గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పట్టా అందుకున్నారు. నాడు జరిగిన ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత, నాయనమ్మ.. కేసీఆర్, శోభ దంపతులు.. తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లి అలేఖ్య హాజరయ్యారు.