విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్... టీడీపీకి క్రెడిట్ ఇచ్చేసిన కేటీఆర్!
అవును... ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రక్రియ ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదంతా కూటమి పుణ్యమే అని అంటున్నారు!
ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఎంత హాట్ టాపిక్ గా ఉందనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రస్తుతానికి ఆగిపోయిందని.. ఏపీలోనూ, కేంద్రంలోనూ కూటమి అధికారంలోకి రావడం వల్ల ఇది సాధ్యమైందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రక్రియ ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదంతా కూటమి పుణ్యమే అని అంటున్నారు! ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క తెలంగాణలో సింగరేణికి సరికొత్త సమస్యలు మొదలయ్యాయని బీఆరెస్స్ నేతలు గగ్గోలు పెడుతున్నారు!
ఇందులో భాగంగా తెలంగాణలో సింగరేణిని బొందపెట్టడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయని కేటీఆర్ అన్నారు. ఇదే సమయంలో... సింగరేణి మెడపై కేంద్రం కత్తి పెడితే... ఆ కత్తికి కాంగ్రెస్ సానబెడుతోందని ఆరోపించారు. ప్రధానంగా బొగ్గు బ్లాక్ ల వేలం పాటను కేంద్రం ఉపసంహరించుకుని సింగరేణి పరిధిలోని బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు.
అలాకానిపక్షంలో సింగరేణి ని ప్రైవేటీకరించడానికే ఈవేలాలని స్పష్టతకు రావొచ్చని చెబుతున్నారు! బొగ్గును వేలం వేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఆ విధంగా 2021లో బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకించి ప్రధానికి బహిరంగ లేఖ రాసిన రేవంత్.. ఇప్పుడు వేలంలో పాల్గొంటున్నారని కేటీఆర్ తెలిపారు.
ఇదే సమయంలో... అదానీకి బైలదిల్లా గని కేటాయించడం వల్ల విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లిందని.. దీంతో.. నష్టాల్లోకి వెళ్లింది కాబట్టి విశాఖ ఉక్కును అమ్ముతున్నట్లు కేంద్రం తెలిపిందని.. రేపు సింగరేణి పరిస్థితి కూడా ఇదే అని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు! ఈ నేపథ్యంలోనే ఏపీలో 16మంది ఎంపీల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిందని అన్నారు!
ఇందులో భాగంగానే... గతంలో 16 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రంలో మనం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని కేసీఆర్ చెబితే... 16మంది ఎంపీలతో ఏమి చేస్తారని రేవంత్ అన్నారని గుర్తుచేసిన కేటీఆర్... ఇప్పుడు ఆ 16మంది ఎంపీలు ఉండటం వల్లే టీడీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుందని తెలిపారు.
అయితే తెలంగాణలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని అన్నారు. ఇందులో భాగంగా... తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇస్తే... వీళ్లు మాత్రం బొగ్గు గనులను వేలం వేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు!