కేటీయార్ కు షాకిచ్చిన క్యాడర్

తెలంగాణా భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలు, క్యాడర్ తో కేటీయార్ సమావేశమయ్యారు.

Update: 2024-01-21 15:30 GMT

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన దగ్గర నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ కు షాకులు తగులుతునే ఉన్నాయి. తొందరలోనే జరగోబోయే పార్లమెంటు ఎన్నికలకు పార్టీ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ సమావేశాలను కేటీయారే చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి తనదే బాధ్యతగా కేటీయార్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో అప్పటినుండి సమావేశాల్లో కేటీయార్ ను నేతలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఇపుడావంతు క్యాడర్ తీసుకున్నట్లుంది.

తెలంగాణా భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలు, క్యాడర్ తో కేటీయార్ సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీయార్ మాట్లాడారు. అయితే ఆయన మాటలను క్యాడర్ మధ్యలోనే కట్ చేసేశారట. ఇలాంటి మాటలు పదేళ్ళపాటు చెప్పిచెప్పే పార్టీని ముంచేశారంటు తీవ్రంగా మండిపడ్డారట. పార్టీ పెట్టిన దగ్గర నుండి కష్టపడిన తమకు పదవులు ఎందుకు ఇవ్వలేదని కేటీయార్ ను నిలదీశారని సమాచారం. ఉద్యమంతో ఎలాంటి సంబంధంలేని ఇతర పార్టీల నేతలను తీసుకొచ్చి అందలం ఎక్కించారని తీవ్రంగా ఆక్షేపించారట.

కష్టపడిన తమను మంత్రులుగా పనిచేసిన వారు ఎవరూ కనీసం దగ్గరకు కూడా రానీయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారట. అధికారంలో ఉన్నపుడు గుర్తుకురాని ద్వితీయశ్రేణి నేతలు క్యాడర్ ఇపుడు మాత్రం గుర్తుకు వచ్చారా అంటు కేటీయార్ ను నిలదీశారట. ఇతర పార్టీల నుండి తీసుకొచ్చి అందలాలు ఎక్కించిన వారితోనే పనిచేయించుకుని పార్లమెంటు సీట్లు గెలిపించుకోండని కూడా క్యాడర్ గట్టిగానే చెప్పినట్లు పార్టీలో టాక్. కేటీయార్ ను అనాల్సిన అనేసి, చెప్పాల్సినవి చెప్పేసిన క్యాడర్లో చాలామంది సమావేశాల మధ్యలోనే బయటకు వెళ్ళిపోయారట.

బయటకు వెళుతున్న వాళ్ళని వారించాలని కేటీయార్ ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదని సమాచారం. దాంతో అవమానంగా భావించిన కేటీయార్ కూడా సమావేశంలో కూర్చోవటం ఇష్టంలేని వెళ్ళిపోవచ్చని గట్టిగానే చెప్పారట. దాంతో మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారని తెలిసింది. ఖమ్మం, భద్రాచలం నుండి వచ్చిన నేతలు, క్యాడర్ ఉదయం వచ్చి సాయంత్రం వరకు వెయిట్ చేశారని అలాంటిది సిటీలోనే ఉండే మీకు వెయిట్ చేయటానికి ఏమొచ్చిందని కేటీయార్ కూడా మండిపడ్డారట. అయితే కేటీయార్ మాటలను పట్టించుకోకుండా చాలామంది వెళ్ళిపోయారట.

Tags:    

Similar News