వైరల్ అవుతున్న కేటీఆర్ ఓల్డ్ పిక్... ఇచ్చిపాడేసిన ఆరెస్పీ!
సందర్భంగా కేటీఆర్ కు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటో లోని కేటీఆర్ చేతుల్లో ఒక ఫ్లకార్డ్ ఉంది. ఆ ఫ్లకార్డ్ లో ఒక కీలమైన పాయింట్ ఉంది.
రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే శ్రీరంగనీతులకు, అధికారం లోకి వచ్చిన తర్వాత వేసే వేషాల కు ఏమాత్రం పొంతన ఉండదు అని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ విషయంలో కొంతమంది నిష్ణాతులు గురించి అయితే చెప్పేపనే లేదు.
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా తెలంగాణ బహుజన సమాజవాదీ పార్టీ చీఫ్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తాజాగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటో లోని కేటీఆర్ చేతుల్లో ఒక ఫ్లకార్డ్ ఉంది. ఆ ఫ్లకార్డ్ లో ఒక కీలమైన పాయింట్ ఉంది.
ఆ ఫ్లకార్డుల్లో.. "ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపివేయాలి.. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి - టీఆరెస్స్" అని రాసి ఉంది. ఆ ఫ్లకార్డును రెండు చేతుల తో పైకి ఎత్తిపట్టుకుని కేటీఆర్ ప్రదర్శిస్తున్నారు.
ఈ సందర్భంగా.. "హలో... కేటీఆర్ గారు.. గీ ఫోటో గుర్తుందా? తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు. అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా (నాన్న గారి మాటల్లోనే)!
మీరు మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ
చరిత్రను మరచిపోయేంత సన్నాసులం మేం కాదు. 75 ఏళ్ల నుంచి 99% ఉన్న బహుజనులు
1% ఉన్న ఆధిపత్య పాలకుల కు ఓట్లేసి గెలిపిస్తే పేదల భూములను కాపాడలేదు సరికదా అమాంతంగా మింగేసిండ్రు.
75 ఏళ్లలో ఏ ఆధిపత్య పార్టీలు తీర్చని లోటు, బీఎస్పీ అధికారం లోకి వచ్చిన వెంటనే పేదల భూములకు రక్షణ కల్పిస్తాం" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
కాగా.. తాజాగా తెలంగాణ సర్కార్ చేపట్టిన కోకాపేట భూముల వేలం రికార్డ్ స్థాయి ధరలు పకికిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎకరా 100 కోట్ల రూపాయల ధర పలికిన సంగతి తెలిసిందే.