మత్తు కోసం ఎముకల పొడి... సమాధులపై పడ్డ దుండగులు!

ఈ నేపథ్యంలో దేశంలోకి సుమారు ఆరేళ్ల క్రితం ఎంటరైన ఒక డ్రగ్ లో ఎముకల పొడి కూడా ఒక ఇంగ్రిడియెంట్ గా వాడతారంట..

Update: 2024-04-10 04:45 GMT
మత్తు కోసం ఎముకల పొడి...  సమాధులపై పడ్డ దుండగులు!
  • whatsapp icon

ప్రస్తుతం ప్రపంచానికి ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఉగ్రవాదం ఒకటైతే... అంతకు మించిన సమస్యగా మారుతోంది డ్రగ్స్! అయితే ప్రజలు మత్తుమందుకు బానిసలవ్వడానికి గల కారణాల్లో పేదరికం కూడా ఒకటనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో... పశ్చిమ ఆఫ్రికాలోని ఓ దేశంలో మత్తుపదార్ధాల సమస్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.

ఈ నేపథ్యంలో దేశంలోకి సుమారు ఆరేళ్ల క్రితం ఎంటరైన ఒక డ్రగ్ లో ఎముకల పొడి కూడా ఒక ఇంగ్రిడియెంట్ గా వాడతారంట.. దాని పేరే "కుష్". దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే... ఈ తాకిడి తట్టుకోలేక ఆ దేశంలో ఏకంగా ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించారు. దీంతో... ఆ దేశ పరిస్థితితో పాటు ఆ డ్రగ్ కి సంబంధించిన చర్చ ఆసక్తిగా మారింది.

అవును... పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌ లో అత్యవసర పరిస్థితి విధించారు. అండుకు కారణం... ప్రజలు విపరీతంగా మాదకద్రవ్యాల మత్తులో ఊగిపోతుండటమే అని అంటున్నారు. ఆ దేశంలో సుమారు ఆరేళ్ల క్రితం దేశంలోకి ఎంటరైన "కుష్‌" అనే మత్తుపదార్థమే ఈ సమస్య ఈ స్థాయిలో పెరిగిపోవడానికి ప్రధాన కారణం అని అంటున్నారు.

ఇక ఈ కుష్ అనే మత్తుపదార్థం విషయానికొస్తే... దీనిలో వివిద రకాల మత్తుపదార్ధాలను కలిపి మరీ చేస్తారంట. ఇదే సమయంలో... దీంట్లోకి ప్రత్యేకంగా మనిషి ఎముకలను కూడా వాడతారని చెబుతున్నారు. ఈ సమయంలో రోజు రోజుకీ ఈ డ్రగ్ కి డిమాండ్ పెరిగిపోవడంతో.. డీలర్లు దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా దొంగలకు డబ్బులు ఇచ్చి సమాధులను తవ్విస్తున్నారని.. అందులోని అస్థిపంజరాలను వెలికితీసి ఆ ఎములకను ఈ డ్రగ్ తయారుచేసేవారికి సరఫరా చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా వందల కొద్దీ సమాధులను తవినట్లు గుర్తించిన అధికారులు.. అక్కడ భద్రతను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

ఈ విషయాలపై స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు బయో... వినాశకరమైన సింథటిక్ డ్రగ్ "కుష్" వల్ల సియోర్రా లియోన్ అస్తిత్వానికి ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆ డ్రగ్ తీసుకుంటున్న వారిలో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News