లేడి అఘోరి ఘోరాలు : యో*ని పూజ అంటూ రూ.10లక్షలు తీసుకొని మోసం?

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.;

Update: 2025-04-15 05:12 GMT
Lady Aghori Accused of ₹10 Lakh Fraud


Full View

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సనాతన ధర్మం, దేశ రక్షణ అంటూ హడావుడి చేస్తున్న ఈమె అసలు స్వరూపం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళను యో*ని పూజ పేరుతో రూ. 10 లక్షలు మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన ఓ మహిళా నిర్మాత పోలీసులను ఆశ్రయించి లేడీ అఘోరి శివ విష్ణు బ్రహ్మ అట్లూరి తనను మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. ఆరు నెలల క్రితం లేడీ అఘోరితో పరిచయం ఏర్పడిందని, ఆమె మాటలు నమ్మి యోని పూజకు అంగీకరించానని బాధితురాలు తెలిపారు. ఈ మేరకు పోలీసులు లేడీ అఘోరిపై కేసు నమోదు చేశారు.

బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు నెలల క్రితం లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది. రెండు నెలల తర్వాత ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చినప్పటి నుంచి లేడీ అఘోరి తరచూ ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేది. ఒకసారి యో*ని పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మి పూజకు అంగీకరించాను.

"పూజ ఖర్చుల కోసం ముందుగా రూ. 5 లక్షలు లేడీ అఘోరి అకౌంట్ లో వేశాను. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫాం హౌస్ కు తీసుకెళ్లి పూజ చేసింది. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్ లో వేయాలని లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని బెదిరించింది. ఆమె మాటలకు భయపడిపోయి మరో రూ. 5 లక్షలు అకౌంట్ లో వేశాను" అని బాధితురాలు పోలీసులకు వివరించారు.

ఈ ఘటనతో లేడీ అఘోరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనూ ఆమెపై పలు ఆరోపణలు రాగా, తాజాగా ఈ ఘటన ఆమె అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ కేసును ఏ విధంగా దర్యాప్తు చేస్తారో వేచి చూడాల్సి ఉంది.


Tags:    

Similar News