గోదారోళ్లా మజాకా... కోడి పందేలలో లేడీ బౌన్సర్ల సందడి!
పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో కోడి పందేల బరుల వద్ద లేడీ బౌన్సర్లు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో కుటుంబ సభ్యులతోనూ, బంధువులు, స్నేహితులతోనూ అంతా సంతోషంగా గడిపారు. ఇక ఏపీలో.. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడి కొనసాగింది. బరుల్లో పందెం కోళ్ల ఫైట్స్ పై కోట్ల రూపాయలు చేతులు మారాయని చెబుతున్నారు.
భారీ బరులలో ఆసక్తికరంగా ఈ పందేలు నడిచినట్లు చెబుతున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మహిళలకు, పురుషులకు వేరు వేరుగా వేదికలు ఏర్పాటు చేసి మరీ పందేలు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో.. పందేల వద్ద లేడీ బౌన్సర్లు హల్ చల్ హాట్ టాపిక్ గా మారింది.
అవును... పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో కోడి పందేల బరుల వద్ద లేడీ బౌన్సర్లు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా బౌన్సలు అంటే ఎత్తుగా, బలంగా ఉంటారనేది తెల్లిసిన విషయమే. అయితే అందుకు పూర్తి భిన్నంగా అన్నట్లుగా లేడీ బౌన్సర్లు దర్శనమిచ్చారు. అందరినీ కంట్రోల్ చేస్తూ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు.
ఎప్పుడూ చూడని విధంగా అన్నట్లుగా కోడి పందేల బరుల వద్ద ఇలా లేడీ బౌన్సర్లు కనిపించడం స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని అంటున్నారు. అయితే... ఈ పందేల వద్ద కనిపించిన లేడీ బౌన్సర్లు టోపీ ధరించడంతో పాటు ముఖానికి నల్లటి మాస్కులు ధరించారు. వాస్తవానికి ఇది కోవిడ్ సమయం కాదు.. అయినప్పటికీ వాళ్లు మాస్కులు ఎందుకు ధరించారు అనే విషయంపైనా చర్చ జరగడం గమనార్హం.
ఇందులో భాగంగా.. ఈ లేడీ బౌన్సర్లు టోపీలు పెట్టుకుని, కళ్లద్దాలు పెట్టుకుని, ముఖానికి నల్లని మాస్క్ లు ధరించింది.. కేవలం తమను ఎవరూ గుర్తు పట్టకుండానేనా.. లేక, మరో కారణం ఏమైనా ఉందా అనే చర్చ ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా... ఈ లేడీ బౌన్సర్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.