ఆ దీవిలో రాళ్లు దొంగిలించినా భారీ జరిమానే?

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. దాన్ని కాపాడుకోకపోతే సమస్యలు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వనరులను మనమే నాశనం చేసుకుంటున్నాం.

Update: 2024-03-23 00:30 GMT

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. దాన్ని కాపాడుకోకపోతే సమస్యలు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వనరులను మనమే నాశనం చేసుకుంటున్నాం. దీంతోనే కష్టాలు ఎదుర్కొంటున్నాం. ఈనేపథ్యంలో సహజ సంపదలు పాడు చేసుకుంటే మనకే నష్టం. స్పెయిన్ లోని కానరీ దీవుల సముదాయం లాంజరోట్. ఇక్కడ జనసంచారం అధికంగా ఉంటుంది. దీంతో చాలా మంది అక్కడి వస్తువులను ఎత్తుకెళ్లడం చేసేవారు. దీంతో వాటి సంరక్షణ ప్రశ్నార్థకంలో పడింది.

దీనిపై అక్కడి అధికారులు స్పందించారు. ఆ దీవిలో ఏదైనా తీసుకెళ్తే జరిమానాలు విధించేందుకు నడుం బిగించారు. అక్కడ ఇసుక, రాళ్లు ఎత్తుకెళితే వారికి ఫైన్ విధించే ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి వస్తువులు దంగతనం కాకుండా కాపాడుకుంటున్నారు. ద్వీపాల పర్యావరణ వ్యవస్థపై హానికర ప్రభావం పడకుండా కాపాడుకుంటున్నారు. ఏ దేశానికైనా అక్కడి సహజ సంపదలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తుంచుకోవడం ప్రధాన విధి.

సందర్శకుల తాకిడి కూడా ఎక్కువే. పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి రానుండటంతో అక్కడి అధికారులు విధిస్తున్న జరిమానాతో నీటి వనరుల కొరత తీరనుంది. ఇటీవల అత్యవసర పరిస్థితి కూడా ప్రకటించారు. సహజవనరుల మనుగడకు ప్రమాదం ఏర్పడకుండా తీసుకునే చర్యలు సత్ఫలితాలు ఇస్తూనే ఉన్నాయి. దీనికి అధికార యంత్రాంగం కూడా చొవర చూపుతోంది.

సందర్శకులకు ఏవైనా వస్తువులు ముట్టుకుంటే రూ. 2 లక్షల వరకు విధించే జరిమానాతో చాలా మంది భయపడుతున్నారు. అక్కడ ఏం ముట్టడానికి కూడా ఇష్టపడటం లేదు. దీంతో నీటి వనరుల మనుగడ మంచి డెవలప్ మెంట్ తో ముందుకెళ్తోంది. అధికారులు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అక్కడి వనరులకు ఎలాంటి ఢోకా లేకుండా చేస్తున్నాయి.

ఏ దేశానికైనా సహజ సంపదలు సురక్షితం ఉండటమే క్షేమం. లేదంటే కరువు కాటకాలు సంభవిస్తాయి. మన సంపదను మనమే నాశనం చేసుకుంటే భవిష్యత్ మనకే ప్రశ్నార్థకంగా మారుతుంది. అసలే సహజ వనరులు కనుమరుగు అవుతున్నాయి. అందుకే స్పెయిన్ ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో వాటి రక్షణకు నడుం బిగిస్తోంది.

Tags:    

Similar News