సంచలన సర్వే : అంతా ఆడవాళ్లదే రాజ్యమట

తాజాగా.. ఐఐఎం అహ్మదాబాద్ జెండర్ సెంటర్ తాజా అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది.

Update: 2024-09-21 12:30 GMT

ఒకప్పుడు వంటింటికే పరిమితం అయిన ఆడవాళ్లు ఇప్పుడు నిర్ణయాధికారులుగా మారుతున్నారు. ఆధునికతను అందిపుచ్చుకుంటున్న వీరు.. ఆ స్థాయిలో రోజురోజుకూ వృద్ధి సాధిస్తున్నారు. ఒకప్పుడు భర్త చెప్పిన మాటే వేదం అన్నట్లుగా నడుచుకున్న వీరిలో ఒక్కొక్కటిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వంటింటికే పరిమితం కాకుండా ఇప్పుడు ఆ ఇంటికే జడ్జిలుగా మారుతున్నారు.

పొలిటికల్‌, సాఫ్ట్ రంగంలో, ఎయిర్ ఫోర్స్ రంగంలో, మీడియా, రక్షణ రంగంలో.. ఇలా ఎన్నో రంగాల్లో మహిళలు తమ సత్తాచాటుతున్నారు. అటు వ్యవసాయ రంగంలోనూ గ్రామాల్లో చూస్తే నాగలి పట్టిన వారూ ఉన్నారు.

మహిళలు అభివృద్ధి సాధిస్తేనే ఆ ఇల్లు బాగుంటుందని అంటుంటారు. ప్రస్తుత పరిస్థితులు కూడా అలానే తయారయ్యాయి. మహిళల్లో ఆలోచనా విధానం పెరుగుతుండడంతో నిర్ణయాధికారం కూడా పెరుగుతోంది. తాజాగా.. ఐఐఎం అహ్మదాబాద్ జెండర్ సెంటర్ తాజా అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది.

705 జిల్లాల్లో ఈ అధ్యయనం కొనసాగింది. ఇందులో ఆసక్తికరవిషయాలు వెలుగుచూశాయి. 67.5 శాతం జిల్లాల్లో మహిళల ఆరోగ్యం, గృహ కొనుగోళ్లు, జీవిత భాగస్వామి ఆదాయం ఖర్చు విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. అలాగే.. ఒంటరిగా లేదా భాగస్వామితో కలిసి ఆస్తులు కలిగి ఉన్న వారు కూడా 29 నుంచి 35 శాతానికి చేరినట్లు అధ్యయనం తెలిపింది.

Tags:    

Similar News