జిగిబిగి ప్ర‌శ్న‌లు-గ‌జిబిజి స‌మాధానాలు: చుక్క‌లు చూపిన‌ జెమినీ ఏఐ

తాజాగా ఇదే విష‌యాన్ని నిపుణులు కూడా చెబుతున్నారు. జెమినీ ఏఐపై ఆధార‌ప‌డ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు.

Update: 2024-05-26 05:06 GMT

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వ్య‌వ‌హారం ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ప్ర‌స్తుతం అంద‌రికీ అందుబాటులో ఉన్న ఏఐ.. జెమినీ! త‌ర‌చుగా ఎక్కువ మంది కూడా దీనిని వినియోగిస్తున్నారు. అయితే.. ఇది ఇస్తున్న స‌మాధానాలు ఇప్పుడు వివాదం గా మారాయి. దీంతో ఎంత వ‌ర‌కు జెమినీ ఏఐపై ఆధార‌ప‌డొచ్చు.. అనేది ప్ర‌శ్న‌. తాజాగా ఇదే విష‌యాన్ని నిపుణులు కూడా చెబుతున్నారు. జెమినీ ఏఐపై ఆధార‌ప‌డ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. గ‌తంలోనూ జెమినీ ఏఐ వివాదం అయిన విష‌యం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మ‌రోసారి కూడా వివాదంగా మారింది.

విష‌యం ఏంటంటే..

ప్ర‌ఖ్యాత గూగుల్ కంపెనీ అడ్వాన్స్‌డ్ వెర్ష‌న్ ఏఐని తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఎలాంటి ప్ర‌శ్న‌కైనా ఇది వెంట‌నే స‌మాధా నం ఇస్తుంద‌నే పేరు తెచ్చుకుంది. దీంతో వైద్యుల నుంచి ఇంజ‌నీర్ల వ‌ర‌కు కూడా.. ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతున్నారు. అయితే.. కొన్ని కొన్నిసార్లు జెమినీ ఏఐ ఇస్తున్న స‌మాధానాలు నెటిజ‌న్ల‌ను జుట్టుపీక్కునేలా చేస్తున్నాయి.

+ మ‌నుషులు రాళ్లు తినొచ్చా? అన్న ప్ర‌శ్న‌కు.. చిత్ర‌మైన స‌మాధానం ఇచ్చింది. ''రాళ్ల‌లో మిన‌ర‌ల్స్‌, విట‌మిన్‌లు ఉంటాయి కాబ‌ట్టి.. రోజుకు ఒక రాయి చొప్పున తింటే ఆరోగ్యంగా ఉంటారు'' అని జెమినీ ఏఐ స‌మాధానం ఇచ్చింది. వాస్త‌వానికి ఇది త‌ప్పుడు స‌మాధానం. పైగా నెటిజ‌న్ల‌ను ఇరుకున పెట్టే స‌మాధానం. దీంతో జెమినీ ఏఐపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

+ పిజ్జాపై చీజ్ నిల‌వ‌ట్లేదు.. పిజ్జాను ఎలా త‌యారు చేయాల‌న్న మ‌రో నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు.. కూడా జెమినీ ఏఐ ఇలానే స‌మాధానం ఇచ్చింది. పిజ్జాపై గ‌మ్ వేసి.. త‌ర్వాత చీజ్ వేస్తే.. నిలుస్తుంద‌ని చెప్పింది. ఇది విన్న నెటిజ‌న్‌కు మైండ్ బ్లాంక్ అయింది.

+ అమెరికా దేశానికి ముస్లిం వ్య‌క్తి అధ్య‌క్షుడిగా ప‌నిచేశారా? అన్న ప్ర‌శ్నకు ఏమాత్రం త‌డుముకోకుండా.. బ‌రాక్ హుస్సేన్ ఒబామా అని ఏఐ స‌మాధానం ఇచ్చింది. దీంతో యూజ‌ర్లు.. జెమినీ ఏపై నిప్పులు చెరుగుగుతున్నారు. ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో స‌మాధానం కోరితే.. ఇలానే చెబుతుందా? అని నివ్వెర పోతున్నారు. దీనిపై నిపుణులు సైతం ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. ఇదంతా త‌ప్పుడు స‌మాచార‌మ‌ని.. యూజ‌ర్ల‌ను త‌ప్పుదోవ‌ప‌ట్టించ‌డ‌మేన‌ని అంటున్నారు. అయితే.. గూగుల్ మాత్రం దీనిని స‌మ‌ర్థించుకుంటోంది. ''మీరు త‌ప్పుడు ప్ర‌శ్న‌లు అడిగి స‌రైన స‌మాధానం చెప్ప‌మంటే ఎలా?'' అని ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News