టేకాఫ్ విమానం పక్కనే బాంబు..

వీరి కేంద్ర స్థానం లెబనాన్. హిజ్బుల్లాలు ఇరాన్ పెంపుడు కుమారుల కింద లెక్క.

Update: 2024-11-14 16:09 GMT

సరిగ్గా 13 నెలులుగా హమాస్ పై యుద్ధం సాగిస్తోంది ఇజ్రాయెల్. గత ఏడాది తమ భూభాగంలోకి జొరబడి పౌరులను ఎత్తుకెళ్లిన హమాస్ లను అణచివేయడమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది. అయితే, హమాస్ లకు మద్దతుగా రంగంలోకి దిగారు హిజ్బుల్లాలు. వీరి కేంద్ర స్థానం లెబనాన్. హిజ్బుల్లాలు ఇరాన్ పెంపుడు కుమారుల కింద లెక్క. దీంతో హిజ్బుల్లాల అంతమూ చూడాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఈ కమ్రంలో ఇరాన్ కూడా యుద్ధంలోకి ప్రవేశించింది.

ఏప్రిల్ లో దాడితో

ఈ ఏడాది ఏప్రిల్ లో లెబనాన్ రాజధాని బీరుట్ లోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ) ఉన్న భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఐఆర్జీసీ కమాండర్లు పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇరాన్ లో అతిథిగా ఉన్న హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను హతమార్చింది ఇజ్రాయెల్. దీంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. మరోవైపు ఇరాన్ కూడా ఇటీవల ఇజ్రాయెల్ పైకి రాకెట్లను ప్రయోగించింది. 2 వేల కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే అది ఎక్కడకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి.

లెబనాన్ పై విరుచుకు పడుతూ

హిజ్బుల్లాల స్థావరం లెబనాన్ పై తరచూ విరచుకుపడుతోంది ఇజ్రాయెల్. గతంలోనూ భీకర దాడులు చేసింది. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గాజాలో హమాస్ చీఫ్ సిన్వర్ నూ హతమార్చింది. దీంతో హమాస్ లు కాస్త వెనక్కుతగ్గారు. మరోవైపు లెబనాన్ లోని హిజ్బుల్లాలను తుదముట్టించకుంటే ఎప్పటికైనా ఇబ్బందేనని ఇజ్రాయెల్ భావన. ఇందులో భాగంగా గురువారం బీరుట్ విమానాశ్రయంపై దాడికి దిగింది.

టేకాఫ్ సమయంలో..

లెబనాన్ చిన్న దేశం. ఒకప్పుడు ప్రగతి పథంలో పయనించినా ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిన్నది. హిబ్బుల్లాల కేంద్రమైన ఈ దేశంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతో బీరుట్ ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. కాగా, గురువారం టేకాఫ్ అవుతున్న విమానం పక్కనే బాంబు వేసింది ఇజ్రాయెల్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు ఇప్పటికే లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 3356 మంది చనిపోయారు. కొన్ని ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ ఆదేశించింది కూడా.

Tags:    

Similar News