ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్‌... 117 మంది ఇండియన్స్ లిస్ట్ ఇదే!

అవును... ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఒలెంపిక్స్ కు ముహూర్తం దగ్గరపడింది. ఈ సమయంలో భారత బృదం కూడా ఒలింపిక్స్ కు సిద్ధమైంది.

Update: 2024-07-17 14:38 GMT

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అంటే.. ఇంకా 9 రోజుల్లో విశ్వ క్రీడా సంబరం ప్రారంభం కానుందన్నమాట. ఈ నేపథ్యంలో పారిస్ వేదికగా అంగరంగ వైభవంగా ఈ క్రీడలు నిర్వహించడానికి ఏర్పాట్లు అన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇదే సమయంలో భారత అథెట్ల బృంధం కూడా సిద్ధమైంది.

అవును... ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఒలెంపిక్స్ కు ముహూర్తం దగ్గరపడింది. ఈ సమయంలో భారత బృదం కూడా ఒలింపిక్స్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో... భారత్ ఈసారి 117 మంది అథ్లెట్లను పంపుతోంది. దీనికి సంబంధించిన జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. వీరితోపాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారుల బృంధం కూడా పారిస్ కు వెళ్లనుంది.

అయితే వీరిలో 72 మంది ఖర్చులను మాత్రం ప్రభుత్వమే భరించనుంది. వాస్తవానికి నియమ నిబంధలన ప్రకారం సహాయక సిబ్బంది సంఖ్య 67కు మించకూడదు. ఈ నేపథ్యంలో... 67 మంది సహాయక సిబ్బందితో పాటు ఐదుగురు వైద్య సిబ్బంది ఖర్చులను మాత్రం ప్రభుత్వం భరించనుంది. ఇక అథ్లెటిక్స్ బృందంలో 29 మంది ఉండగా... వారిలో 11 మంది మహిళలు, 18మంది పురుషులు ఉన్నారు.

ఇక షూటింగ్ టీంలో 21, హాకీ జట్టులో 19 మంది, టేబుల్ టెన్నీస్ లో 8, బ్యాడ్మింటన్ 7, రెజ్లింగ్ 6, బాక్సింగ్ 6, ఆర్చరీ 6, గోల్ఫ్ 4, టెన్నీస్ 3, స్విమ్మింగ్ 2, సెయిలింగ్ 2, ఈక్వస్ట్రియన్, రోయింగ్, జుడో, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ఒక్కొక్కరూ పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్ లో పథకాల ఆశలు రేపుతున్న క్రీడాకారులు చాలామందే ఉన్నారు.

ఇదే క్రమంలో... 2021లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా... భారత బృందానికి చెఫ్ దే మిషన్ గా షూటర్ గగన్ నారంగ్ నియమితులయ్యారు. మరోపక్క ఒలెంపిక్స్ లో పాల్గొనే అథ్లెట్ల జాబితాలో మహిళా షాట్ పుటర్ అబా కతువా పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో ఆమె ఈ ఒలెంపిక్స్ కు అర్హత సాధించినా ఆమె పేరును ఎందుకు తొలగించారనేది స్పష్టత లేదు.

Tags:    

Similar News