ఐసీయూలోనే అద్వానీ.. హెల్త్ అప్‌డేట్స్‌ రిలీజ్

కాగా.. తాజాగా ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి సిబ్బంది లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేశారు.

Update: 2024-12-14 08:03 GMT

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. 97 ఏళ్ల వయసున్న అద్వానీ వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా.. తాజాగా ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి సిబ్బంది లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేశారు.

ఎల్‌కే అద్వానీ 1927లో నవంబర్ 8న ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించారు. సంపన్న వ్యాపారవేత్త కిషన్ చంద్ అద్వానీ, జియాని దేవి దంపతులకు ఆయన జన్మించారు. హైదరాబాద్‌లో డీజీ నేషనల్ కాలేజీలో చదివిన తర్వాత ముంబయి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించారు. అనంతరం మిలిటెంట్ హిందూ గ్రూప్ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరిపోయారు. అనంతరం దేశ విభజన జరిగింది. ఆ తరువాత భారతదేశం వచ్చిన తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీలో చేరారు. ఆ వెంటనే రాజస్థాన్ జనసంఘ్ పార్టీ అధ్యక్షుడికి సలహాదారుగా నియామకం అయ్యారు.

ఢిల్లీలో మెట్రోపాలిటన్ కౌన్సిల్‌కు మధ్యంతరం జరిగిన ఎన్నికల్లో 1966లో కార్పొరేషన్‌ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1970లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక.. ఆ తర్వాత మీసా చట్టం కింద 1975లో అరెస్ట్ అయ్యారు. జైలుకు సైతం వెళ్లారు. ఇక 1977లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ రెండు పార్టీల కలయికతో భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో మూడు సార్లు కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. భారత ఉప ప్రధానిగానూ ఆయన ఎన్నికయ్యారు. అద్వానీ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను భారత రత్నతో సత్కరించింది.

అయితే.. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న అద్వానీని ఆసుపత్రిలో చేర్పించగా.. తాజాగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఢిల్లీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని పేర్కొన్నాయి. అద్వానీ రెండు రోజుల క్రితమే ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. శనివారం మాత్రం ఐసీయూలో అడ్మిట్ చేశారు. సీనియర్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరీ ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News