"చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి!"... మరోసారి కోర్టుకు లోకేష్!

సాక్షిపై వేసిన పరువునష్టం దావా కేసులో శుక్రవారం విశాఖ కోర్టుకు హాజరవుతున్నారు ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.

Update: 2024-10-18 06:22 GMT

తనపై ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనంపై ఏపీ మంత్రి నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... సాక్షిపై వేసిన పరువునష్టం దావా కేసులో శుక్రవారం విశాఖ కోర్టుకు హాజరవుతున్నారు ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.

అవును... "చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి" పేరుతో 2019లో సాక్షిపత్రికలో ప్రచురితమైన కథనంపై లోకేష్ న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా అసత్య కథనమని చెబుతూ.. సాక్షిపై పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసుపై విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయ్స్థానంలో విచారణ జరుగుతుంది!

ఈ క్రమంలో.. లోకేష్ ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలోనే ఆయన బస చేశారు. "చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి" అనే టైటిల్ తో సాక్షిలో ఓ కథనం ప్రచురితమైన సమయంలో... అది పూర్తిగా అవాస్తవమని, ఉద్దేశ్యపూర్వకంగానే తనను డ్యామేజ్ చేయాలని ఇలాంటి కథనాన్ని వండివార్చారని లోకేష్ అప్పట్లోనే మండిపడ్డారు.

అయితే... లోకేష్ తెలిపిన అభ్యంతరపై సాక్షి నుంచి ఎలాంటి వివరణ వేయలేదు సరికదా.. నోటీసులకూ స్పందించలేదని అంటున్నారు! దీంతో... సాక్షి దినపత్రికపై పరువునష్టం దావా వేశారు లోకేష్. తన పరువుకు భంగం కలిగించారని.. కావాలనే ఈ అసత్య కథనాన్ని ప్రచురించారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News