ఆగండి.. తొంద‌రెందుకు? నేత‌ల‌కు భోజ‌నం పెట్టి పంపేస్తున్న లోకేష్‌.. !

కానీ, ఆగండి.. ఇప్పుడే తొందరొద్దు! అని చిన్న‌బాబు ఆయ‌న‌కు సూచించి.. భోజ‌నం పెట్టి మ‌రీ పంపేశారు.

Update: 2025-02-21 18:30 GMT

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. కూట‌మికి కొరుకుడు ప‌డ‌ట్లేదా? ఆయ‌న‌పై కేసులు పెట్టాల‌ని.. జైలుకు పంపించాల‌ని కొంద‌రు చిత్తూరు జిల్లా నాయ‌కులు ప‌ట్టుబ‌డుతు న్నారు. మీరు ఊ.. అంటే మేం ఫిర్యాదులు చేస్తాం! అంటూ.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ నాయ‌కుడు ఇటీవ‌ల‌ నారా లోకేష్‌ను క‌లుసుకుని మ‌రీ చెప్పారు. కానీ, ఆగండి.. ఇప్పుడే తొందరొద్దు! అని చిన్న‌బాబు ఆయ‌న‌కు సూచించి.. భోజ‌నం పెట్టి మ‌రీ పంపేశారు.

ఈయ‌న ఒక్క‌రే కాదు.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా నుంచి మ‌రో ఇద్ద‌రు కూడా వ‌చ్చారు. వారిని కూడా నారా లోకేష్ ఇటీవ‌ల‌కాలంలో ఇలానే చేశారు. ఇక‌, ప్ర‌భుత్వం త‌ర‌ఫున చూసుకుంటే.. మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఫైళ్లు ద‌హ‌నం చేసిన కేసులో అడుగు కూడా ముందుకు ప‌డ‌డం లేదు. ఈ కేసులో పెద్దిరెడ్డిపై ఎలాగైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ది కూట‌మి స‌ర్కారు ఆలోచ‌న‌గా ఉంది. కానీ, అది పార‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ‌లో ఎలాంటి ఆధారం ల‌భించ‌లేద‌ని.. స్థానికంగా అధికారులు చెబుతున్నారు.

మ‌రోవైపు.. ఇదే భ‌వ‌నాన్నిరెనో వేష‌న్ చేసిన అధికారులు.. ఇటీవ‌ల ప్రారంభించారు. సో.. దాదాపు మ‌ద‌న ప‌ల్లె కేసులో పెద్దిరెడ్డి పాత్ర కానీ, ఆయ‌న అనుచ‌రుల పాత్ర‌కానీ.. ఏమీ తేల‌లేద‌నితెలిసింది. ఇక‌, పెద్దిరెడ్డి అట‌వీ భూములు ఆక్ర‌మించి ఇల్లు క‌ట్టుకున్నార‌ని.. రైతులు బెదిరించి.. పొలాలు గుంజుకున్నార‌న్న వార్త లు కూడా ఓ ప్ర‌ధాన మీడియాలో వ‌చ్చాయి. వీటిపైనా స‌ర్కారు విచార‌ణ‌కు ఆదేశించింది. కానీ... ఇప్ప‌టి వ‌ర‌కు రెండు వారాలు గ‌డిచిపోయినా.. ఒక్క ఆధారం ల‌భించ‌లేదు.

మ‌రోవైపు.. త‌మ‌పై న‌మోదైన కేసులు కొట్టివేయాల‌ని కోరుతూ.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించింది. ఇంకోవైపు పార్ల‌మెంటులో స‌ద‌రు మీడియాపై పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి ప్ర‌శ్న‌లు సంధిస్తూ.. ఇరుకున ప‌డేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక‌ర‌కంగా.. చెప్పాలంటే.. పెద్దిరెడ్డిని ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తే.. ఆయ‌న కుమారుడు.. టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాను టార్గెట్ చేసుకుంటున్నారు. దీంతో ఓ ప‌ట్టాన ఈ కేసులు తేల‌డం లేదు.

మ‌రోవైపు పెద్దిరెడ్డిపై ఫిర్యాదులు చేసేందుకు కొంద‌రు నాయ‌కులు ముందుకు వ‌స్తున్నా నారా లోకేష్ భోజ‌నం పంపేస్తున్నారు త‌ప్ప‌.. కేసుల విష‌యాన్ని మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. సో.. మొత్తానికి పెద్దిరెడ్డి విష‌యంపై ప్ర‌భుత్వం ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న సంకేతాలు అయితే వ్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News