గోల్డ్ హబ్ గా మంగళగిరి..లోకేశ్ కొత్త కల ఆవిష్కరణ
తాజాగా మంగళగిరి రూపురేఖలు మార్చటమే కాదు.. ఎవరూ ఊహించని ఇమేజ్ ను తాను క్రియేట్ చేస్తానంటూ నమ్మకంగా చెబుతున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్.
మంగళగిరి అన్నంతనే పానకాల నరసింహ స్వామి టెంపులు గుర్తుకు వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మంగళగిరి కేంద్రంగా అమరావతి నగరానికి తెర తీశారు చంద్రబాబు. తాజాగా మంగళగిరి రూపురేఖలు మార్చటమే కాదు.. ఎవరూ ఊహించని ఇమేజ్ ను తాను క్రియేట్ చేస్తానంటూ నమ్మకంగా చెబుతున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. మంగళగిరి నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. మంగళగిరిని కొత్త తరహాలో డెవలప్ చేయాలని.. దాన్నో నయా నగరంగా రూపొందించాలన్న యోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన నమా ప్లాన్ ను తాజాగా ఆయన ఆవిష్కరించారు.
మంగళగిరిలో భారీ గోల్డ్ హబ్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను షేర్ చేసిన ఆయన.. అందుకు తగ్గట్లు ఇప్పటివరకు చేసిన గ్రౌండ్ వర్కును బయటపెట్టారు. త్వరలో దేశంలోనే అతి పెద్ద గోడ్ల్ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయుత్తం అవుతుందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే దీనికి సంబంధించిన పని జరుగుతున్నట్లుగా లోకేశ్ వెల్లడించారు. ఇప్పటికే మంగళగిరిలో ఎయిమ్స్ తో పాటు.. పలు ప్రముఖ విద్యా సంస్థల్ని మంగళగిరికి చుట్టుపక్కల ఏర్పాటు చేస్తున్నారు.
దేశంలో నవీ ముంబయి.. కోల్ కతా.. కోయంబత్తూరు లాంటి నగరాల్లో జ్యూయలరీ పార్కులు ఉన్నాయని.. అదే తరహాలో దేశంలోనే అతి పెద్దదైన జ్యూయలరీ పార్కును మంగళగిరిలో ఏర్పాటు చేయనున్నట్లుగా లోకేశ్ వెల్లడించారు. ముంబయి.. దేశంలోనే అతి పెద్ద జ్యూయలరీ పార్కుగా చేసేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పారు. ముంబయిలో రూ.50వేల కోట్ల పెట్టుబడులతో దాదాపు లక్షమందికి ఉపాధి కల్పిస్తుందని.. దానికి ధీటుగా మంగళగిరిలో అతి పెద్ద జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్కును ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు.
మంగళగిరిలో సంప్రదాయ స్వర్ణకార కుటుంబాలు భారీగా ఉన్నాయి. వారి చేతి నిండా పని కల్పించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మంగళగిరిలోని తెనాలి రోడ్డు వెంట ఉన్న అక్షయ పాత్ర భవన సముదాయానికి దక్షిణంగా ఆత్మకూరు ప్రాంత పరిధిలో ఈ గోల్డ్ హబ్ ను ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ఆత్మకైరు సర్వే నంబర్లు 133, 134 135, 136లలో ఉన్న ప్రభుత్వ ఖాళీ.. ఎసైన్డ్ భూముల్లో 60 ఎకరాల్ని అధికారులు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పార్కు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
12 వేల మంది స్వర్ణకార వృత్తిదారులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో జ్యూయలరీ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. అంచెలంచెలుగా అతి పెద్ద గోల్డ్ హబ్ గా డెవలప్ చేయటం.. రాబోయే రోజుల్లో దీన్ని మినీ దుబాయ గా మార్చాలన్నది లోకేశ్ ఆలోచనగా చెబుతున్నారు. ఇంతకూ మంగళగిరిలో ఏర్పాటు చేసే గోల్డ్ హబ్ లో ఏముంటాయి? అన్న ప్రశ్నకు చాలా క్లారిటీతో సమాధానం చెప్పేస్తున్నారు.
లోకేశ్ విజన్ కు తగ్గట్లు ఇప్పటికే పక్కా ప్లాన్ సిద్ధమైంది. దాని ప్రకారం చూస్తే..
- గోల్డ్ హబ్ లో రత్నాలు.. బంగారంతో కూడి ఆభరణాల్ని.. అంతర్జాతీయ ప్రమాణాల్లో అత్యంత నైపుణ్యంగా తయారు చేయటం.
- ఈ ఆభరణాలకు తక్కువగా తరుగు ఉండేలా చూడటం.
- సాధారణంగా వ్యాపారసంస్థలు తరుగును 10 శాతంగా లెక్కిస్తుంటాయి. కానీ.. ఈ పార్కులో కొనుగోలుదారులకు తరుగు దాదాపు 3 శాతమే ఉంటుంది.
- ముక్కుపుడక నుంచి వడ్రాణం వరకు అన్నీ రకాల మోడళ్లు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకు అవసరమైన అత్యాధునిక మిషనరీ అంతా పార్కులో ఉంచుతారు.
- ఎస్ ఏబీఎల్ గుర్తింపు పొందిన టెస్టిగ్ ల్యాబ్ ఏర్పాటు
- జ్యూయలరీ పార్కు కోసం స్వర్ణకారులను సిద్ధం చేస్తారు. ఇందుకోసం లోకేశ్ సొంత ఖర్చులతో ఎల్ఎన్ గోల్డ్‌స్మిత్ ఫౌండేషన్ పేరిట ఓ సంస్థను స్థాపిస్తారు. ఇందులో స్వర్ణకారులందరికీ ఆధునిక డిజైన్ల తయారీపై శిక్షణ ఇప్పిస్తారు.
ఇందుకోసం గౌతమబుద్ధ రోడ్డులో ఐదు అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుకోవటం గమనార్హం.
- ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 670 మంది స్వర్ణకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. పూర్తి చేసుకున్న వృత్తిదారులకు పని కల్పించే బాధ్యతను కూడా లోకేశ్ వ్యక్తిగతంగా తీసుకుంటారని చెబుతున్నారు.
ఇక జ్యూయలరీ పార్కులో..
- ఆడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్
- హాల్‌మార్కింగ్ సెంటర్
- గోల్డ్ వాల్ట్
- సర్టిఫికేషన్ సెంటర్
- లేజర్ ఎన్‌గ్రేవింగ్ సెంటర్
- కో-ఆపరేటివ్ డిస్‌ప్లే సెంటర్
- కేడ్‌తో కూడిన డిజైన్ సెంటర్
- బిజినెస్ సెంటర్
- ఎగుమతులు.. దిగుమతులకు సంబంధించిన ఒక నోడల్ ఏజెన్సీ
- క్లియరింగ్ ఏజెంట్ ఆఫీసెస్
- మ ఫైర్ స్టేషన్
- సెక్యూరిటీ భవనం
- డిస్పెన్సరీ
- నీటి సరఫరా కేంద్రం
- ట్రీట్‌మెంట్ ప్లాంటు
- ఎస్టీపీ
- ఈటీపీ,
- సర్వీస్ బ్లాకు
- ఇంటర్నల్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్
-, పైపులతో కూడిన గ్యాస్ బ్యాంకు
- వివిధ మెగా షోరూమ్‌లకు చెందిన షాపులు ప్రత్యేకంగా ఏర్పాటు