గుడ్లవల్లేరు కాలేజీ ఎపిసోడ్ పై లోకేశ్ క్లారిటీ
రెండు.. మూడు రోజులుగా ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతంపై చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
రెండు.. మూడు రోజులుగా ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతంపై చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బోలెడన్నికథనాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? దేన్ని నమ్మాలి? దేన్ని నమ్మకూడదన్న కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. ఇలాంటి వేళ.. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. హిడెన్ కెమేరా ఉదంతంపై క్లారిటీ ఇచ్చారు. గుడ్లవల్లేరుఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరిగింది? విద్యార్థులు ఎందుకంత ఆందోళన చెందారు? పెద్ద ఎత్తున వీడియోలు బయటకు వచ్చాయని.. హిడెన్ కెమేరాలు పెద్ద ఎత్తున అమర్చినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు లోకేశ్.
హిడెన్ కెమెరా పెట్టారని చెబుతున్నారు కదా? అంటూ జాతీయ మీడియాకు చెందిన విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన లోకేశ్.. ‘‘దొరికిపోయింది. ఏదో అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. వీడియో ఎక్కడ ఉందంటే ఎవరికీ తెలీదు. కెమెరా ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. 300 వీడియోలు బయలకు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. ఒక్క వీడియో అయినా ఎవరి చేతుల్లో అయినా ఉందా? అని చూస్తే.. ఒక్కటి లేదు. పిల్లల అందరి ఫోన్లు జఫ్తు చేసి చెక్ చేసినా ఒక్క వీడియో దొరకలేదు. లేని వీడియోలకు నేనెలా సమాధానం చెబుతాను’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఉదంతంలో హిడెన్ కెమెరా ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదన్న లోకేశ్.. ఇష్యూ జరిగింది నిజమేనని.. నలుగురి మధ్యలో ఇష్యూ ఉందని.. నలుగురి మధ్య లవ్ స్టోరీలో ఏ చర్యలు తీసుకోవాలో అధికారికంగా ఆ చర్యలు తీసుకుంటామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. గుడ్ల వల్లేరు ఇంజనీరింగ కాలేజీ ఘటనలో కెమెరా లేదని.. వీడియోలు అంటూ జరిగేదంతా ప్రచారమే తప్పించి ఇంకేమీ లేదన్నారు.
వైసీపీ నేతల సినీ నటి వేధింపుల కేసు.. మద్యం కుంభకోణం.. భూ ఆక్రమణలు బయటకు రావటంతో వాటి నుంచి ప్రజల చూపు మరల్చేందుకు హిడెన్ కెమెరాల నాటకానికి తెర తీసినట్లుగా పేర్కొన్నారు. ‘జగన్ మాదిరి నేను తల్లీ చెల్లిని రోడ్లపైకి గెంటేసే రకం కాదు. విద్యార్థినులను నా తోబుట్టువులుగా భావించి కంటికి రెప్పలా కాపాడతా’’ అని వ్యాఖ్యానించారు. ఇదే ఉదంతం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. గుడ్ల వల్లేరు కాలేజీ ఘటనపై విచారణ సాగుతుందని.. రాష్ట్రమంతా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేయటం దారుణమన్నారు. గుడ్లవల్లేరు ఘటనపై ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలన్నారు. స్థానిక ఎస్ ఐను సస్పెండ్ చేశారు. బాధితుల పట్ల దురుసుగా వ్యవహరించిన వైనంపై సీరియస్ అయిన ప్రభుత్వం చర్యలు చేపట్టింది.