లోక్‌ సభలో అలజడి... ఆరు రాష్ట్రాలకు దర్యాప్తు బృందాలు!

భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడే సంఘటన నూతన పార్లమెంట్ లో జరిగిన సంగతి తెలిసిందే

Update: 2023-12-18 11:42 GMT

భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడే సంఘటన నూతన పార్లమెంట్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో లోక్‌ సభలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఇందులో భాగంగా... ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు ఆరు రాష్ట్రాలకు వెళ్లాయి. ఈ క్రమంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, హరియాణా, పశ్చిమ బెంగాల్‌ కు రాష్ట్రాలకు దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి.

అవును... ఇటీవల లోక్ సభ సమావేశాలు జరుగుతుండగా పార్లమెంట్ భవనంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పట్టుబడిన నిందితులను తీసుకుని... ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభగాలు ఆరు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. వీటితో పాటు మరో 50 బృందాలు ఈ కీలక దర్యాప్తులో భాగమయ్యాయి. ఈ సమయంలో ఆ బృంధాలు.. నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరిస్తున్నాయని తెలుస్తుంది.

ఇప్పటికే పార్లమెంటులో అలజడి సృష్టించిన ఘటనకు సంబంధించిన ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్‌ ఝా ధ్వంసం చేసిన ఆధారాలను తాజాగా పోలీసులు కనుగొన్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్‌ లోని నాగౌర్‌ జిల్లాలో అతడు ఫోన్ లను దహనం చేసినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కాలిపోయిన ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా... గతవారం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతోన్న సమయంలో విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న మనోరంజన్‌, సాగర్‌ శర్మ అనే ఇద్దరు వ్యక్తులు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అమోల్‌ శిందే, నీలం అనే ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌ బయట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో... ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఘటనానంతరం లలిత్‌ ఝా అనే వ్యక్తి ఢిల్లీ నుంచి రాజస్థాన్‌ కు పారిపోయి ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News