లండన్ టు కోల్ కతా బస్ సర్వీస్... 50 రోజులు - 10వేల మైళ్లు!

సాధారణంగా 12 గంటలకు మించి బస్సు జర్నీ చేస్తే.. మరుసటి రోజు నిద్రలేవడం కష్టం అవుతుందని అంటుంటారు.

Update: 2024-11-30 15:30 GMT

సాధారణంగా 12 గంటలకు మించి బస్సు జర్నీ చేస్తే.. మరుసటి రోజు నిద్రలేవడం కష్టం అవుతుందని అంటుంటారు. అంతలా ఒళ్లు హూనం అయిపోద్దని చెబుతుంటారు. అలాంటిది 50 రోజుల పాటు 10,000 మైళ్ల దూరం (16,100 కిలో మీటర్లు) బస్సులో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది! ఇలాంటి అతి పొడవైన బస్సు మార్గం గతంలో లండన్ – కోల్ కతా మధ్య ఉండేది!

అవును... కొన్ని దశాబ్ధాల క్రితం యునైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ నుంచి భారత్ లోని కోల్ కతాకు సుమారు 33,000 కిలో మీటర్ల బస్సు మార్గం ఉండేది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బస్సు మార్గంగా ఇది చరిత్ర సృష్టించింది. "హిప్పీ రూట్" అని పిలవబడే ఈ బస్సు సర్వీస్ 1957లో ప్రారంభించగా.. 1976 వరకూ కొనసాగింది.

ఆల్బర్ట్స్ ట్రావెల్ అనే బ్రిటీష్ సంస్థ ఈ సర్వీసు ఆలోచన చేసింది.. రెండు ఖండాలను, చాలా భిన్నమైన ప్రపంచాలను అనుసంధానించడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో లండన్ నుంచి బయలుదేరి కోల్ కతాకు చేరుకోవడానికి అనేక దేశాల గుండా సాగింది. ఈ బస్సు 1957 ఏప్రిల్ 15న లండన్ నుంచి తన తొలి యాత్ర ప్రారంభించగా.. అది జూన్ 5న కోల్ కతాకు చేరుకుంది.

అప్పట్లోనే ఈ బస్సులో అనేకరకాల సౌకర్యాలు ఉన్నాయని! ప్రయాణికుల కోసం పర్సనల్ స్లీపింగ్ బంకులు, ఫ్యాన్ ఆపరేటెడ్ హీటర్లు, పూర్తిగా సన్నద్ధమైన కిచెన్ తో పాటు ఎగువ డెక్ లో రెడియో, మ్యూజిక్ సిస్టం కూడా ఉంది. ఇదే సమయంలో భారత్ లోని తాజ్ మహల్ వంటి ప్రసిద్ధ గమ్యస్థానాలను అన్వేషించడానికి ఈ బస్సు ప్రయాణికులకు అనుమతి ఇస్తుంది.

ఇదే క్రమంలో... ఠె రాన్, సాల్జ్ బర్గ్, కాబూల్, ఇస్తంబుల్, వియన్నా వంటి నగరాల్లో షాపింగ్ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది! అనంతరం 1970ల్లో ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విమాన ప్రయాణాలు పెరగడంతో 1976లో ఈ బస్సు సర్వీసు ఆగిపోయింది. దీనిలో ప్రయాణం, ఆహార వసతి కలిపి అప్పట్లో రూ.1933 ఛార్జ్ చేసేవారు!

మొత్తం మీద ఈ బస్సు ఇంగ్లండ్ లోని లండన్ నుంచి బెల్జియంకు.. అక్కడ నుంచి పర్శ్చిమ జర్మనీ, ఆస్ట్రియా, బల్గేరియా, యుగోస్లేవియా, ఇరాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మీదుగా భారత్ చేసుకునేది. ఇక భారత్ లోకి ప్రవేశించిన తర్వాత.. న్యూఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, బనారస్ మీదుగా కోలకతా చేరుకునేది!

Tags:    

Similar News