వామ్మో... లండన్ లో సెల్ ఫోన్ దొంగలు సరికొత్త రికార్డ్..!
సెల్ ఫోన్ దొంగలు ఎక్కడెక్కడ ఉంటారు? అని అంటే... దానికి సమాధానం ఇందు గలరు అందు లేరను సందేహం వలదు అని చెప్పొచ్చనే సంఘటనలు ఎన్నో తెరపైకి వస్తుంటాయి!;
సెల్ ఫోన్ దొంగలు ఎక్కడెక్కడ ఉంటారు? అని అంటే... దానికి సమాధానం ఇందు గలరు అందు లేరను సందేహం వలదు అని చెప్పొచ్చనే సంఘటనలు ఎన్నో తెరపైకి వస్తుంటాయి! సరైన ఆప్షన్స్ ఉన్న సెల్ ఫోన్ ని కొట్టేసినా.. దానివల్ల ఉపయోగం ఉండదని.. ఒకవేళ లాక్ తీసినా ఐ.ఎం.ఈ.ఐ. ద్వారా పోలీసులకు దొరికిపోతామని తెలిసో, తెలియకో కానీ... సెల్ ఫోన్ దొంగలు చెలరేగిపోతూనే ఉన్నారు!
ఈ విషయంలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తారతమ్యాలు ఏమీ లేవు. కాస్త అప్రమత్తంగా లేకపోతే.. ఫ్యాంట్ పాకెట్ తేలికైపోయే ప్రమాదం ప్రతీ చోట ఉంటుంది! కాకపోతే కాస్త రద్దీగా ఉండే ప్రాంతమైతే ఆ అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని అంటారు. ఈ సమయంలో తాజాగా ప్రపంచంలోనే అత్యధికంగా టూరిస్టులు వచ్చే నగరాల్లో ఒకటైన లండన్ లో ఈ సమస్య పీక్స్ కి చేరిందని అంటున్నారు.
అవును... ప్రపంచంలో అత్యధికంగా టూరిస్టులు వచ్చే నగరాల్లో ఒకటైన లండన్ ను కొన్నేళ్లుగా ఓ సమస్య ఇబ్బంది పేడుతోంది. పైగా ఈ సమస్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. నిత్యం బిజీగా ఉండే ఈ నగర వీధుల్లో మొబైల్ దొంగలు పెట్రేగిపోతున్నారు. ఈ విషయంలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరినీ బాధితులుగా మారుస్తున్నారు. ఇప్పుడు ఈ చోరీల లెక్క రికార్డులు సృష్టిస్తోందని చెబుతున్నారు.
ఇందులో భాగంగా... గతేడాదిలో బ్రిటన్ లో సుమారు 83,000 సెల్ ఫోన్ లు చోరీలకు గురైనట్లు చెబుతున్నారు. అంటే... సరాసరిన రోజుకు సుమారు 225 ఫోన్లు చోరీకి గురవుతున్నాయన్నమాట. ప్రధానంగా ఈ లెక్క రాజధాని లండన్ లో విపరీతంగా ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికోసం ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ముఠాల ప్లానింగ్ కూడా పక్కాగా ఉంటుందని అంటున్నారు.
ఇందులో భాగంగా... బాగా రద్దీగా ఉండే ప్రాంతాలను సెలక్ట్ చేసుకుని, బైకులు సాయంతో చోరీలకు పాల్పడుతూ, వేగంగా తప్పించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ క్రిమినల్ గ్యాంగులు వీటితో పాటు ఏటా సుమారు రూ.450 కోట్ల వ్యాపారం చేస్తున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. దీంతో.. లండన్ వీధుల్లో అప్రమత్తంగా ఉంటే.. ‘సెల్’ పోవడం ఖాయమని చెబుతున్నారు.
దీంతో... తీవ్రతను అర్ధం చేసుకున్నరో ఏమో కానీ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి మరీ.. సుమారు 230 మందిని వారం రోజుల వ్యవధిలోనే అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 1000 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సో... ఎప్పుడైనా లండన్ వెళ్తే కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట!