విమానాల్లో లూజ్‌ బోల్ట్‌ ల వ్యవహారం... డోర్‌ ప్లగ్‌ అంటే?

గతకొన్ని రోజులుగా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలకు సంబంధించిన లూజ్ బోల్డ్ ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-01-09 09:09 GMT

గతకొన్ని రోజులుగా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలకు సంబంధించిన లూజ్ బోల్డ్ ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా... ఈ విమానాలను ఉపయోగిస్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాశ ఎయిర్‌, స్పైస్‌ జెట్‌ సంస్థలతో మాట్లాడింది. ఈ క్రమంలో తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును.... బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ తాజాగా సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికాలోని యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ తమ బోయింగ్‌ విమానాల్లో తనిఖీలు చేపట్టింది. ఆ తనిఖీలలో ఏకంగా 10 విమానాల్లో బోల్టులు లూజుగా ఉన్నట్లు గుర్తించిందని తెలుస్తుంది. దీంతో మరోసారి బోయింగ్ ఫ్లైట్స్ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన యునైటెడ్ ఎయిర్ లైన్స్... శనివారం నుంచి తమ విమానాల్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా... డోర్‌ ప్లగ్‌ లు బిగించే సమయంలో తలెత్తిన సమస్యలు ఇంకా ఉన్నట్లు గుర్తించామని వెల్లడించింది. ఇదే సమయంలో అలాస్కా ఎయిర్‌ లైన్స్‌ తనిఖీల్లో కూడా ఇటువంటి లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది.

తాజాగా సుమారు తమ వద్ద ఉన్న 10 విమానాల్లో సమస్యలు ఉన్నట్లు అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ ప్రకటించడంతో బోయింగ్ 737 మ్యాక్స్‌ పై ఆందోళనలు మరింత పెరిగాయని తెలుస్తుంది. దీంతో తనిఖీలపై మార్గదర్శకాలను తయారు చేసేందుకు బోయింగ్‌ - అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్.ఏ.ఏ) మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు వచ్చాయని తెలుస్తుంది.

ఇదే సమయంలో... ప్రస్తుత పరిణామాలపై స్పందించిన అలాస్కా ఎయిర్‌ లైన్స్‌... బోయింగ్ నుంచి తుది మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే అలాస్కా ఎయిర్‌ లైన్స్‌ తనిఖీల్లోనూ ఇలాంటి లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సంస్థ కూడా మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తుంది!

ఏమిటీ డోర్ ప్లగ్ లు?:

విమానంలో ఎమర్జెన్సీ సిట్యువేషన్ వచ్చినప్పుడు కేవలం 90 సెకన్లలో వందల మంది ప్రయాణికులను కిందకు దించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒకటే ఎగ్జిట్‌ డోర్‌ ఉంటే ఇది సాధ్యం కాదు. అందుకే తగినన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ లు ఉండాల్సి ఉంటుంది. దీంతో డోర్‌ ప్లగ్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బోయింగ్ 737మ్యాక్స్‌ విమానాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ను రీప్లేస్‌ చేసేందుకు వీలుగా ఈ డోర్‌ ప్లగ్‌ లను అమర్చుతున్నారు.

Tags:    

Similar News