కేఎల్ రాహుల్ పేరు చెప్పి సంజయ్ గొయెంకాపై నెటిజన్లు ఫైర్!

ఈ నేపథ్యంలో సంజయ్ గొయెంకా తాజాగా చేసిన నర్మగర్భ వ్యాఖ్యలను విని, గతన్ని గుర్తు చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు.

Update: 2024-11-01 07:36 GMT

ఐపీఎల్ - 2025 మెగా వేలం నిర్వహణకు ముందు ఫ్రాంఛైజీలు తమ రిటైన్ ఆటగాళ్ల పేర్లతో లిస్ట్ ను విడుదల చేశాయి. ఈ సమయంలో పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. అందులో కేఎల్ రాహుల్ వ్యవహారం ఒకటి. తాజాగా లక్నో సూపర్ జైంట్స్ రిటైన్ ఆటగాళ్ల లిస్ట్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్ పేరు లేదు!

దీంతో... అతడికి వేలంలో మంచి ధర పలికె అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఆ సంగతి అలా ఉంటే... రాహుల్ ని వదులుకోవడానికి గల కారణం అదే అంటూ గత ఐపీఎల్ ని గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. దీంతో... ఆ ఫ్రాంచైజీ యజమాని సంజయ్ గొయెంకా ను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.

అవును... కేఎల్ రాహుల్ ని లక్నో యాజమాన్యం వదులుకుంది. దీంతో... కెప్టెన్సీ అనుభవం, వికెట్ కీపింగ్ తో పాటు లక్నోని ప్లేఆఫ్స్ కి తీసుకెళ్లిన అనుభవం కారణం అతడికి వేలంలో మంచి ధర పలికే అవకాశాలున్నాయని అంటున్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ ని తప్పించడంపై ఫ్యాన్స్ నెట్టింట ఫైర్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో సంజయ్ గొయెంకా తాజాగా చేసిన నర్మగర్భ వ్యాఖ్యలను విని, గతన్ని గుర్తు చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా తమ జట్టు రిటెన్షన్ లిస్ట్ ప్రకటన అనంతరం స్పందించిన గొయెంకా... తమ తొలి రిటెన్షన్ నిర్ణయం కేవలం రెండు నిమిషల్లోనే తీసుకున్నట్లు తెలిపారు. మొహసీన్ ఖాన్, ఆయుష్ బదోనిని కూడా కొనసాగించినట్లు చెప్పారు.

ఈ సమయంలోనే... ఆటగాళ్ల ఎంపికలో తాము ఒకే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నామని.. అందులో భాగంగా.. గెలవాలన్న లక్ష్యంతో ఉనన్వారినే ఎంపిక చేశామని.. వ్యక్తిగత లక్ష్యాలకు దురంగా ఉంటూ జట్టు విజయం కోసం శ్రమించేవారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

ఇలా "వ్యక్తిగత లక్ష్యాలు" అంటూ సంజీవ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు రాహుల్ ని ఉద్దేశించి చేసినవే అని అంతున్నారు. నిస్వార్ధంగా జట్టుకోసం ఆడే ఆటగాడైన రాహుల్ లు చేజేతులా వదులుకున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గొయెంకా వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.

కాగా... గత ఐపీఎల్ లో హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ అనంతరం గొయెంకా - రాహుల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు కనిపించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇలా మైదానలోనే కెప్టెన్ పై వాదనకు దిగడం సరికాదంటూ గొయెంకా తీరును తప్పుపట్టారు నెటిజన్లు. ఈసారి రిటెన్షన్ లిస్ట్ లో లేకుండా చేయడంతో మరింత మందిపడుతున్నారు.

Tags:    

Similar News