కక్కుర్తి తగలయ్యా.. లూలూ మాల్ ను లూట్ చేశారా?

మహానగరంలో నివసిస్తున్న కేరళీయులు.. పాతబస్తీకి చెందిన ముస్లింలు సైతం పెద్ద ఎత్తున లూలూ మాల్ ను విజిట్ చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించారు.

Update: 2023-10-04 04:13 GMT

షాపింగ్ మాల్స్ కు కొదవ లేని మహానగరం హైదరాబాద్. విశ్వ నగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్.. ఇటీవల కాలంలో ప్రాంతాలకు అతీతంగా అందరిని ఆకర్షిస్తోంది. ఇదే.. దేశంలోని మిగిలిన మహానగరాల కంటే వేగంగా డెవలప్ మెంట్ దిశగా దూసుకెళుతోంది. అలాంటి హైదరాబాద్ మహానగరంలో.. నగర పౌరులు వ్యవహరించిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారటమే కాదు.. వారి కక్కుర్తి చేష్టలు వైరల్ వీడియోగా మారి.. ఇదెక్కడి ఆరాచకర్రా బాబు అనేలా చేస్తోంది.

జేఎన్ టీయూ రోడ్డులోమంజీరా మాల్ కాస్తా లూలూ మాల్ గా మారటం తెలిసిందే. ప్రపంచ స్థాయి మాల్ నిర్వహణలో లూలూకున్న ప్రత్యేక స్థానం.. ఈ మాల్ పై అందరి చూపు పడింది. దీనికి తోడు.. లాంగ్ వీకెండ్ కావటంతో ఈ మాల్ కు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల వారు పోటెత్తారు. సాధారణంగా హైదరాబాద్ లోని మాల్స్ ను చూస్తే.. ఏ ప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న మాల్స్ కు వెళ్లటమే కానీ.. 40-50 కి.మీ. ప్రయాణించి మరీ మాల్ కు వచ్చిన మొదటి ఉదంతం లూలూ మాల్ కే దక్కింది.

మహానగరంలో నివసిస్తున్న కేరళీయులు.. పాతబస్తీకి చెందిన ముస్లింలు సైతం పెద్ద ఎత్తున లూలూ మాల్ ను విజిట్ చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. జాతరను తలపించేలా లాంగ్ వీకెండ్ జనం పోటెత్తారు. మాల్ లోకి హైపర్ మార్కెట్ లోకి వెళ్లేందుకు క్యూ సిస్టం పెట్టి.. రద్దీని క్రమబద్ధీకరించేందుకు వెయిటింగ్ పిరియడ్ పెట్టిన పరిస్థితి. ఉదయం 8 గంటలకు తెరిచే ఈ మాల్.. రాత్రి 11 గంటల వరకు నాన్ స్టాప్ గా నడిచింది. తాజాగా ఈ మాల్ లో హైదరాబాదీయులు కొందరి కక్కుర్తికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

విపరీతమైన రద్దీ నేపథ్యంలో వివిధ ఫుడ్ పాకెట్లు.. కూల్ డ్రింక్స్ ను తాగేసి.. వాటిని అక్కడే పడేసి.. వెళ్లిపోయిన వైనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతున్నాయి.

హైదరాబాదీయులకు ఇదేం కక్కర్తి? ఎంత కొత్త మాల్ అయితే మాత్రం మర్యాదను మిస్ అవుతారా? ఈ రీతిలో లూట్ చేస్తారా? హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్న ఈ లూట్ వీడియోను చూసినప్పుడు.. ప్రపంచ స్థాయి నగరంలో అందుకు తగ్గట్లు ప్రజలు ఉండాలి కదా? అన్న మాట వినిపిస్తోంది. స్వీయ క్రమశిక్షణ మిస్ అయి.. ఆరాచకంగా వ్యవహరించిన తీరును తప్పు పడుతున్నారు.

Tags:    

Similar News