జేసీ వ్యాఖ్యలపై మాధవీలత ఘాటు రియాక్షన్..!

ఈ సమయంలో తనపై జేసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాధవీలత స్ట్రాంగ్ గా స్పందించారు.

Update: 2025-01-03 14:16 GMT

ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత వ్యవహారం ఇప్పుడు తీవ్ర హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మాటల యుద్ధాలు కోటలు దాటుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో తనపై జేసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాధవీలత స్ట్రాంగ్ గా స్పందించారు.

అవును... మాధవీలతను ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీ నేతలు ఆమెను ఎందుకు పెట్టుకున్నారో తెలియదని, ఆమె పెద్ద వేస్ట్ పర్సన్ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాధవీలత స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేస్తూ.. జేసీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఆ వయసైపోయిన ఆయన తన గురించి పచ్చి పచ్చి బూతులు మాట్లాడారని.. ఈ సందర్భంగా ఆయన సంస్కారవంతమైన భాషకు తన ధన్యవాదాలని మాధవీలత అన్నారు. మహిళల రక్షణ గురించి మాట్లాడటమే తాను చేసిన నేరం అయితే.. అందుకే తనపై కేసులు పెడితే.. ఇలాంటివి వెయ్యి కేసులు పెట్టినా తగ్గేదేలే అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో... "వాళ్ల తాడిపత్రి మహిళలే మహిళలు, పతివ్రతలు.. పక్క ఊరిలో ఉన్నవాళ్లంతా పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకు, గొప్ప సంస్కారానికి.. తాడిపత్రిలో ఉండే ప్రతీ పతివ్రతకు, వారిని సమర్ధిస్తున్నటువంటి ప్రతి పురుషుడుకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు" అని తెలిపారు.

ఇక.. తాను మాట్లాడిన వాటిలో బూతులు ఏమీ లేదని, అసలు ఆ పెద్దాయన ఎవరో కూడా తెలియదని చెప్పుకొచ్చిన మాధవీలత.. జేసీ పార్క్ అనేది ఆయన కట్టించుకున్నదనే విషయం కూడా తనకు తెలియదని అన్నారు. ఈ సందర్భంగా... తాడిపత్రికే కాదు.. ప్రతీ ఊరికీ ఓ గొప్ప చరిత్ర ఉంటుందని ఆమె తెలిపారు.

తాడిపత్రి నుంచి ఎంతో మంది ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్స్ ఉన్నారని.. వారు కూడా దాదాపు సినిమా నటులే అని.. ఈ నేపథ్యంలో తెరపై కనిపించేవారంతా ప్రాస్టిట్యూట్స్ అని ఆయన అన్నారు కాబట్టి.. తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెరపై కనిపిస్తున్నారో, ఫ్యూచర్ లో కనిపించాలనుకుంటున్నారో.. వారు ఎవరూ ఇండస్ట్రీకి రావొద్దని అన్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు తెరపైన కనిపించేవాళ్లంతా వ్యభిచారులు కాబట్టి తాడిపత్రి నుంచి మహిళలు ఎవరూ ఇండస్ట్రీకి రావొద్దని.. తెరపైన కనిపించొద్దని ఆమె స్పందించారు. కానీ... తాడిపత్రిలోని మహిళలకు అర్ధరాత్రి 1 గంటవరకూ బయట ఉండే స్వతంత్రం కావాలని.. డీజేలు కావాలని.. ఏదైనా ఆ ఊరివరకే ఉంచుకోవాలని అన్నారు!

ఈ సమయంలో... జేసీని సమర్ధిస్తున్న సైకో బ్యాచ్ అందరికీ ధన్యవాదాలు అని చెప్పిన మాధవీలత... తనకు భయం అంటే తెలియదని, తనను మర్డర్ చేస్తానన్నా చేసుకోవచ్చని, తన తల రాతలో ఏమి రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప, అక్కడ రాయనిది ఏమీ జరగదని ఆమె చెప్పుకొచ్చారు!

Tags:    

Similar News