ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం... వైసీపీ ఎంపీ కీలక నిర్ణయం!

దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం లో అత్యంత కీలపాత్ర పోషించింది సౌత్ గ్రూప్ నుంచి వరుసగా అప్రూవర్ గా మారుతుండటం ఆసక్తిగా మారింది

Update: 2023-09-09 07:49 GMT

ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు... అరెస్టుల వార్తలు, హస్తినలో అలజడులు... ఢిల్లీలో తీగలాగితే హైదరాబాద్లో డొంక కదిలిన చప్పుల్లూ... ఇవన్నీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు! ఈ సమయంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ అప్రూవర్ గా మారారు!

అవును... దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన విషయం జరిగింది. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌ గా మారారు. ఈ కేసులో ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవ రెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌ గా మారిన సంగతి తెలిసిందే.

దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం లో అత్యంత కీలపాత్ర పోషించింది సౌత్ గ్రూప్ నుంచి వరుసగా అప్రూవర్ గా మారుతుండటం ఆసక్తిగా మారింది. ఇలా అప్రూవర్ గా మారినవారంతా ప్రస్తుతం బెయిల్‌ పై ఉన్నారు. ఈ అప్రూవర్లు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు పలువురిని ప్రశ్నిస్తారు!

మాగుంట రాఘవరెడ్డి, ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు మరికొందరిని ప్రశ్నిస్తున్నారన్ని తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్‌ నుంచి హస్తినకు నగదు ఎలా తరలించారనే విషయంపై ఈడీ దృష్టి పెట్టిందని తెలుస్తుంది. ఈ స్కాం లో హవాలా వ్యవహారాలు నడిపించిన 20 మందిని ఇప్పటికే ఈడీ ప్రశ్నించింది.

ఇదే క్రమంలో బీఆరెస్స్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఆడిటర్‌ బుచ్చిబాబును ఇటీవల ఈడీ మరోసారి ప్రశ్నించిందని తెలుస్తుంది. అయితే అత్యంత గోప్యంగా సాగుతోన్న ఈ విచారణల్లో... రానున్న రోజుల్లో మరికొంత మందిని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది.

అయితే... ఢిల్లీ లిక్కర్ స్కాం లో మాగుంట రాఘవరెడ్డితో పాటు తాజాగా ఆయన తండ్రి ఎంపీ శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవర్లుగా మారడం ఊహించని పరిణామమేనని పరిశీలకులు అంటున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఇండో స్పిరిట్ కంపెనీలో కీలక భాగస్వామి అయిన మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్‌ గా మారడంతో... ఈడీకి ఎలాంటి సమాచారం ఇచ్చి ఉంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News