ఆసక్తికరంగా మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్... పవన్ కష్టం ఫలించిందా?
మాహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది.
మాహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఈ సందర్భంగా విడుదలవుతున్న ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికర ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమి విజయం సాధించే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.
అవును... మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వార్ వన్ సైడ్ కాదన్నట్లుగానే పోలింగ్ జరిగిందని చెబుతుండగా.. ఎగ్జిట్ పోల్స్ మాత్రం దాదాపుగా వార్ వన్ సైడ్ అన్నట్లుగా వెల్లడిస్తున్నాయి! మరికొన్ని సంస్థలు మాత్రం టఫ్ ఫైట్ ని ప్రెడిక్ట్ చేస్తున్నాయి!
తాజాగా వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్ లో మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) టీమ్ "మహాయతి" వైపే మొగ్గు చూపినట్లు పేర్కొంటున్నాయి. మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని "మహా వికాస్ అఘాడి" ప్రతిపక్షానికే పరిమితమని చెబుతున్నాయి! ఇక ఝార్ఖండ్ లోనూ కాషాయ జెండా రెపరెపలు కన్ ఫాం అని అంటున్నాయి.
మహారాష్ట్ర:
ఏబీపీ:- మహాయతి 150 - 170; ఎంవీఏ 110 - 130; ఇతరులు 8 - 10
పీఎంఏఆర్క్యూ:- మహాయతి 137 - 157; ఎంవీఏ 126 - 146; ఇతరులు 0
పీపుల్ పల్స్:- మహాయతి 175 - 196; ఎంవీఏ 85 - 112; ఇతరులు 0
జన్ మత్:- మహాయతి 130 - 145; ఎంవీఏ 125 - 140; ఇతరులు 0
చాణక్య స్ట్రాటజీస్:- మహాయతి 152 - 160; ఎంవీఏ 130 - 138; ఇతరులు 6 - 8
ఝార్ఖండ్:
టైమ్స్ నౌ - జేవీసీ:- ఎన్డీయే 40 - 44; ఇండియా కూటమి 20 - 40; ఇతరులు 1 - 1
పీపుల్స్ పల్స్:- ఎన్డీయే 46 - 58; ఇండియా కూటమి 24 - 37; ఇతరులు 6 - 10
మాట్రిజ్:- ఎన్డీయే 42 - 47; ఇండియా కూటమి 25 - 30; ఇతరులు 1 - 4
కాగా... మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 145. ఇక, ఝార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 41.