వెధవ.. దొంగ‌విరా... నువ్వు: మాజీ మంత్రి జ‌న‌సేన నేత తీవ్ర వ్యాఖ్య‌లు

ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావుపై జ‌న‌సేన నేత, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జి పోతిన మ‌హేష్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2023-08-12 11:03 GMT

పోక‌చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నేరెండంటా.. అన్న‌ట్టుగా మారిపోయింది.. ఏపీ రాజ‌కీయ ప‌రిస్థితి. అధికారంలో ఉన్న నాయ‌కులు నోరు అదుపులో పెట్టుకోవ‌డం.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారూ.. అంత‌కు మించి అనేస్తున్నారు. మ‌రి భావిత‌రానికి వీరు ఏం నేర్పిస్తున్నారో తెలియ‌దు కానీ.. ఫ‌క్తు.. బ‌జారు గొడ‌వ‌ల‌కు దిగేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావుపై జ‌న‌సేన నేత, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జి పోతిన మ‌హేష్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

స‌భ్య స‌మాజం ఏమ‌నుకున్నా.. మ‌న‌కేం అనుకుంటున్నారో ఏమో.. కానీ, నేత‌లు అనేస్తున్న మాట‌లు మాత్రం ప్ర‌జ‌ల‌కు విన‌సొంపుగా కాదు.. వికారంగా ఉంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌ను 'రా' అని సంబోధించిన వెల్లంపల్లిపై మహేష్ మ‌రింత‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "పవన్ కళ్యాణ్‌ను ఏరా అంటావారా వెల్లంపల్లి. వెధవ.. గుడిలో లింగాన్ని దోచే దొంగవిరా నువ్వు. పవన్ కళ్యణ్‌ను ఏకవచనంతో మాట్లాడితే తాట తీస్తాం" అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. రెండు రోజుల్లో వెల్లంపల్లి అక్రమాల చిట్టా విప్పుతామ‌ని మ‌హేష్ చెప్పారు. జబర్దస్త్ చేసుకొంటూ బెంజ్ కార్లో రోజా తిరిగితే బాగుంటుంది.. రోజాకి ఇవే చివరి ఎన్నికలు అని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డం.. నాయ‌కులు స‌హ‌నం కోల్పోతుండ‌డంతో రాజ‌కీయాలు , వ్యాఖ్య‌లు కూడా దారి త‌ప్పేస్తున్నాయి. ఫ‌లితంగా ఈ సారి రాష్ట్రం మొత్తం వివాదాస్ప‌ద రాష్ట్రంగా ఎన్నిక‌ల సంఘం న‌మోదు చేసినా ఆశ్చ‌ర్యం లేదని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

విమ‌ర్శ‌లు ఉండాల్సిందే.. కానీ, హ‌ద్దులు మీర‌డం ఇటు అధికార ప‌క్షానికీ.. అటు ప్ర‌తిప‌క్షానికీ కూడా స‌రికాద‌ని చెబుతున్నారు. గ‌తంలో ఉన్న నాయ‌కులు ఇలానే వ్య‌వ‌హ‌రించి ఉంటే.. అస‌లు రాజ‌కీయాలంటే అస‌హ్యం పుట్టేద‌ని.. కానీ, నాడు అంతో ఇంతో నిర్మాణాత్మ‌క పాలిటిక్స్ క‌నిపించాయ‌ని చెబుతున్నారు. కానీ, నేడు ఏరా.. ఒరేయ్‌.. వెధ‌వ‌.. సైకో.. అంటూ.. చేస్తున్న వ్యాఖ్య‌లు.. రాజ‌కీయాల‌ను దుర్భ‌ర స్థితిలోకి నెడుతున్నాయ‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News