మన ఇల్లు-మన లోకేష్: యువ నేత దూకుడు
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.;

టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే.. 'మన ఇల్లు- మన లోకేష్'. గత ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అనేక మంది ప్రజలు.. తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు తెలిసో.. తెలియకో.. ప్రభుత్వ భూముల్లో ఇళ్లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా వాటిలోనే ఉంటున్నామని చెప్పారు.
కానీ... వైసీపీ ప్రభుత్వం తమను ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చిందని.. తమకు దిక్కు మొక్కు ఎవరూ లేర ని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నారా లోకేష్..తమ ప్రబుత్వం ఏర్పడిన తర్వాత.. ఆయా భూము ల్లోనే ఇళ్లకు పట్టాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోఇటీవల కాలంలో పార్టీ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు ఈ సమస్యలు ఉన్న ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.
వీటిపై తాజాగా స్పందించిన నారా లోకేష్.. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కార్యాల యంలో .. ఓ కుటుంబానికి పట్టాలతో పాటు.. నూతన వస్త్రాలు ఇచ్చి వారికి భరోసా ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరికే చెందిన గోవిందు, సీతామహాలక్ష్మి దంపతులకు `మన ఇల్లు-మన లోకేష్` కార్యక్రమం కింద.. ఇంటి పట్టాను ఇచ్చారు.
ఇక, ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా తనకు సమస్యలు చెప్పుకొన్న వారిలో 3 వేల కుటుంబాలను ఎంపిక చేసి వారికి కూడా.. పట్టాలు ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రకటించారు. దీంతో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో ఉంటున్నవారికి ఉపశమనం దక్కనుంది.