మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి డబుల్ షాక్

గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన అమోయ్ కుమార్.. అప్పటి మున్సిపల్ కమిషనర్ యూసఫ్ లపైనా పోలీసులు కేసు నమోదు చేవారు

Update: 2023-12-27 04:55 GMT

హైదరాబాద్ మహానగర శివారులోని ఇబ్రహీం పట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డికి డబుల్ షాక్ తగిలింది. తాజాగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్ పర్సనర్ సవ్రంతి ఇచ్చిన కంప్లైంట్ ఈ ఇద్దరితో పాటు మరికొందరిపైనా పోలీసులు ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన అమోయ్ కుమార్.. అప్పటి మున్సిపల్ కమిషనర్ యూసఫ్ లపైనా పోలీసులు కేసు నమోదు చేవారు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది.

ఇంతకూ మున్సిపల్ ఛైర్ పర్సన్ స్రవంతి ఇచ్చిన ఫిర్యాదేంటి? అందులో ఆమె చేసిన ఆరోపణలు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. తాను బుడగ జంగాల తెగకు చెందిన వ్యక్తినని.. రిజర్వేషన్ ప్రరకారం మున్సిపల్ ఎన్నికల్లో తనకు చైర్ పర్సన్ అవకాశాన్ని కల్పిస్తే.. తన నుంచి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి.. ఆయన కుమారుడు రూ.2.5 కోట్ల మొత్తాన్ని తీసుకొన్నట్లుగా పేర్కొన్నారు. కొంత కాలం తర్వాత తనను తక్కువగా చూస్తూ.. మనో వేదనకు గురి చేసినట్లుగా ఆరోపించారు.

తనను టార్గెట్ చేసిన వారు.. అందులో భాగంగా పద్నాలుగు మంది కౌన్సిలర్లతో తనపై అవిశ్వాసానికి అప్పటి కలెక్టర్ అయోయ్ కుమార్ కు కంప్లైంట్ చేయించారన్నారు. అప్పటి కలెక్టర్ వారిచ్చిన ఫిర్యాదుతో తనను సెలవుపై వెళ్లమని సలహా ఇచ్చారని.. లేదంటే సస్పెండ్ చేస్తామని బెదిరించి షోకాజ్ నోటీసు ఇచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ సైతం తనను తక్కువ చేసి మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. ఏడాది క్రితమే ఈ అంశాలపై తాను ఎస్సీ.. ఎస్టీ కమిషన్ కు కంప్లైంట్ చేసినట్లుగా పేర్కొన్న స్రవంతి.. ఎస్సీ.. ఎస్టీ కమిషన్ సూచనతో ఈ నెల 22న ఇబ్రహీంపట్నం పోలీసులు తన నుంచి కంప్లైంట్ తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇందులో భాగంగా నలుగురి పైన ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని నమోదు చేసినట్లుగా వెల్లడించారు. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే కానీ ఆయన కుమారుడు కానీ స్పందించలేదు.

Tags:    

Similar News