'మా నాన్న దేవుడే కానీ'... మీడియా ముందు ఏడ్చేసిన మనోజ్!

ఆదివారం ఉదయం నుంచి మనోజ్ పై దాడి జరిగిందంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మనోజ్ కన్నీరు పెట్టుకున్నారు.. మీడియాకు క్షమాపణలు చెప్పారు.

Update: 2024-12-11 07:09 GMT

మంచు కుటుంబంలో జరుగుతున్న వ్యవహారంలో నెటిజన్ల దృష్టిలో బాధితుడిగా గుర్తించబడినట్లు చెబుతున్న మనోజ్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం నుంచి మనోజ్ పై దాడి జరిగిందంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మనోజ్ కన్నీరు పెట్టుకున్నారు.. మీడియాకు క్షమాపణలు చెప్పారు.

అవును... మంచు కుటుంబం వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ మనోజ్ పై చాలామంది సానుభూతి చుపిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధులకు మంచు మనోజ్ క్షమాపణలు చెప్పారు. తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు తరుపున మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన మనోజ్... జర్నలిస్టు కుటుంబాలకు తానెప్పుడూ తోడుగా ఉంటానని.. తన కోసం వచ్చిన మీడియా మిత్రులకు ఇలా జరగడం బాధగా ఉందని అన్నారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఊహించలేదని అన్నారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

ఈ సందర్భగా... తన కుటుంబ సభ్యులను తాను ఏమీ అడగలేదని.. తాను ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదని.. సొంతకాళ్లపై పనిచేసుకుంటున్నానని మనోజ్ తెలిపారు. అయితే.. ఈ వివాదంలోకి తన భార్య, ఏడు నెలల కుమార్తెను లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మనోజ్.. తన భార్య వాళ్లింట్లోనూ ఏమీ అడగలేదని తెలిపారు.

అయితే... తాను ఆస్తికోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నామని మనోజ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే... "మా నాన్న దేవుడు.. కానీ, ఈ రోజు చుస్తున్నది మా నాన్నను కాదు.. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు" అని మనోజ్ అన్నారు!

ఇదే సమయంలో... నేడు పోలీసుల విచారణకు హాజరవుతానని.. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తానని మనోజ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. ఇన్నాళ్లు ఆగాను, ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్పేస్తానని మనోజ్ వెల్లడించారు.

Tags:    

Similar News