అప్పుడు బ్రిట‌న్‌-ఇప్పుడు అమెరికా.. మోడీకి కాక‌!!

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు, ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విధానాల‌ను తూర్పార‌బ‌డుతున్న కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై ఆ పార్టీ నేత‌లు ఎదురు దాడి చేస్తున్నారు

Update: 2024-04-25 17:34 GMT

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు, ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విధానాల‌ను తూర్పార‌బ‌డుతున్న కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై ఆ పార్టీ నేత‌లు ఎదురు దాడి చేస్తున్నారు. ఇక లొంగ‌రు అనుకున్న‌వారికి కేసుల వాత‌లు పెడుతూ.. లైన్‌లోకి తెచ్చుకుంటు న్నారు. కానీ, అంత‌ర్జాతీయంగా రెండు బ‌ల‌మైన దేశాలు.. మోడీ హ‌యాంలో జ‌రిగిన తీవ్ర ఘ‌ర్ష‌ణ‌ల‌ను ప్ర‌పంచం దృష్టికి తెచ్చాయి. వీటిలో మోడీని నేరుగా ఎవ‌రూ ఏమీ అన‌లేదు.కానీ, ఆయ‌న విధానాల‌ను.. మౌనాన్ని.. అత్యంత సంక్లిష్ట‌త‌ల స‌మ‌యంలో ఆయ‌న అనుస‌రించి తీరును మాత్రం చాలా న‌ర్మ‌గ‌ర్భంగా తూర్పార‌బ‌ట్టాయి.

బ్రిట‌న్‌..: గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో బ్రిట‌న్‌కు చెందిన బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా(బీబీసీ).. సంచ‌ల‌న డాక్యుమెంట‌రీల సిరీస్‌ను విడుద‌ల చేసిన విష‌యం గుర్తుందా? అదే.. ''ఇండియా: ది మోడీ క‌శ్చ‌న్‌'' పేరుతో విడుద‌ల చేసిన ఈ సిరీస్‌.. తీవ్ర‌స్థాయిలో క‌ల‌క‌లం రేపింది. ఒక‌ప్పుడు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోడీ హ‌యాంలో గోద్ర ప్రాంతంలో అల్ల‌ర్లు చోటు చేసుకున్నాయి. రైళ్లు, బ‌స్సులు, ఇళ్ల ద‌హ‌నాల‌తో రెండు వేల మంది పౌరులు ద‌హ‌న‌మైపోయారు. ఈ ఘ‌ట‌న‌ల‌కు బాధ్యులు.. మౌనంగా ఉన్న సీఎం మోడీనేన‌ని పేర్కొంటూ.. బీబీసీ స‌సాక్ష్యంగా డాక్యుమెంట‌రీని విడుద‌ల చేసింది. అయితే.. దీనిని భార‌త ప్ర‌భుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అంతేకాదు.. క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే భార‌త నెట్ నుంచి దీనిని తొల‌గించింది. అప్ప‌టికే దీనిని చూసిన అలీగ‌ఢ్ ముస్లిం యూనివ‌ర్సిటీవిద్యార్థుల‌ను అరెస్టు చేయించారు. ఇప్ప‌టికీ వారు జైల్లోనేఉన్నారు. ఈ దెబ్బ త‌ర్వాత‌.. బీబీసీపై ఐటీ దాడులు చేయ‌డం.. త‌ర్వాత‌.. ఇటీవ‌ల ఈ సంస్థ భార‌త్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవ‌డం తెలిసిందే. ఇక‌, బ్రిట‌న్ ప్ర‌భుత్వాన్ని కూడా.. మోడీ స‌ర్కారు హెచ్చ‌రించింది. ఇది అంత‌ర్గ‌త విష‌య‌మ‌ని పేర్కొంది.

క‌ట్ చేస్తే....

అమెరికా: ఇప్పుడు అగ్ర‌రాజ్యం అమెరికా వంతు వ‌చ్చింది. గ‌త ఏడాది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రుగుతున్న‌.. ఈ శాన్య రాష్ట్రం మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న జాతుల ఘ‌ర్ష‌ణ‌.. ఈ క్ర‌మంలో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన అకృత్యాలు.. దారుణాలు.. పోలీసుల కాల్పులు.. ప్ర‌భుత్వం చెబుతున్న‌ది.. క్షేత్ర‌స్థాయిలో జ‌రిగింది.. మొత్తం 1500 మందికిపైగా మృతి చెందిన వారి వివ‌రాలు.. బంధువుల ఆర్త‌నాదాలు.. అభిప్రాయాలు.. ప్ర‌భుత్వాల ఉదాసీన‌త‌.. ప్ర‌జాసంఘాల ఆగ్ర‌హాలు .. ఇలా అన్నింటినీ గుది గుచ్చి.. ''మ‌ణిపూర్ డాక్యుమెంట్‌''ను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ విడుదల చేశారు. దీనిలో ప్ర‌బుత్వ వాద‌న‌ను.. స్థానిక ప‌రిస్థితుల‌ను కూడా వెల్ల‌డించారు. అంతేకాదు.. ''భార‌త్‌లో నిజాల‌కు ఎలాంటి విలువ ఉందో.. బీబీసీ ఆఫీస్‌ను ఎందుకు మూసివేశారో.. తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది'' అని పుస్త‌కం పీఠిక‌లో పేర్కొన్నారు.

అయితే.. య‌థాలాపంగా.. ఈ పుస్త‌కాన్ని భార‌త్‌లో విడుద‌ల చేయ‌బోమ‌ని ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చెప్పేసింది. అంతేకాదు.. ''గోద్రా' సిరీస్‌ ట్రాష్‌.. 'మ‌ణిపూర్' డాక్యుమెంట్ ట్రాష్‌.. మీరు చెప్పేది ట్రాష్‌.. ట్రాష్‌!!''అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.ఈ నివేదిక పూర్తిగా పక్షపాత ధోరణితో రూపొదించారని నిప్పులు చెరిగారు.

Tags:    

Similar News