నా జుట్టు విష్ణు చేతుల్లోకి వెళ్లాలనే ఈ కుట్రలు : మంచు మనోజ్

నటుడు మోహన్‌బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మంచు మనోజ్ తన కారును ఎవరో తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.;

Update: 2025-04-09 10:31 GMT
నా జుట్టు విష్ణు చేతుల్లోకి వెళ్లాలనే ఈ కుట్రలు : మంచు మనోజ్

నటుడు మోహన్‌బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మంచు మనోజ్ తన కారును ఎవరో తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చర్యకు తన సోదరుడు మంచు విష్ణునే కారణమని మనోజ్ ఆరోపించారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం మనోజ్ జల్‌పల్లిలోని తన నివాసానికి చేరుకుని గేటు వద్ద నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది ఆస్తి వివాదం కాదని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఈ సమస్య మొదలైందని, తన జుట్టును విష్ణుకు ఇచ్చేందుకే ఇలా చేస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మనోజ్ మాట్లాడుతూ "నాకు ఆస్తి వద్దని ఎప్పుడో నాన్నకు చెప్పాను. ఇది కేవలం విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం. అక్కడే ఈ గొడవ మొదలైంది. డిసెంబర్ నుండి గొడవలు జరుగుతున్నా పోలీసులు ఇంతవరకు ఒక్క ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు. కత్తులు, గన్లతో రౌడీలు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు ఇచ్చాను. ఇంట్లో నా పెంపుడు జంతువులు, ఇతర వస్తువులు ఉన్నాయి. వాటి కోసమే నేను ఇక్కడికి వచ్చాను," అని తెలిపారు.

పాప పుట్టినరోజు వేడుకల కోసం తాము జైపూర్ వెళ్లిన సమయంలో విష్ణు పథకం ప్రకారం తన అనుచరులతో తెల్లవారుజామున ఇంటికి వచ్చి కార్లను తీసుకెళ్లారని, తన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. కమిషనర్ ఇచ్చిన బైండోవర్‌ను వారు అనేకసార్లు ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. తాను తప్పు చేశానని లేదా ఆస్తి కోసం అడిగానని ఒక్క ఆధారం చూపించినా అందరి కాళ్లపై పడి క్షమాపణ కోరతానని మనోజ్ అన్నారు. చోరీ గురించి పోలీసులకు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని, తన సెక్యూరిటీ ఫిర్యాదును కూడా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. ప్రస్తుతం తన ఇంట్లోకి వెళ్లడానికి పోలీసుల అనుమతి కావాలని, మోహన్‌బాబు చెబితేనే లోపలికి పంపిస్తామని వారు చెబుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తన సమస్యను పరిష్కరించాలని మనోజ్ విజ్ఞప్తి చేశారు. కోర్టు నోటీసులు ఉన్నా తనను లోపలికి అనుమతించడం లేదని ఆయన తెలిపారు.

తన కుటుంబం నుండి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని మనోజ్ స్పష్టం చేశారు. బయట నిర్మాణ సంస్థల్లో హిట్లు కొడితే ఆ డబ్బును సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు తీయడానికి ఉపయోగించాలని అనేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. విష్ణు కెరీర్‌ను నిలబెట్టడానికి తాను లేడీ గెటప్ కూడా వేశానని, వారి కోసం ఎంతో కష్టపడ్డానని ఆయన అన్నారు. అయినప్పటికీ విష్ణు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'కన్నప్ప' సినిమాకు పోటీగా 'భైరవం' విడుదల చేద్దామని అనుకున్నామని, దానితో టెన్షన్ పడి విష్ణు 'కన్నప్ప' విడుదల వాయిదా వేసుకున్నాడని, ఆ కోపంతోనే ఇదంతా చేస్తున్నాడని మనోజ్ ఆరోపించారు. తన తల్లిదండ్రులకు ఈ బాధలు అవసరమా అని ప్రశ్నించిన మనోజ్, విష్ణు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడవచ్చు కదా అని అన్నారు.

Tags:    

Similar News