పవన్ మీద తీవ్ర విమర్శలు చేసిన మావో నేత...!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే తాను చెగువెరా స్పూర్తిని తీసుకున్నానని తనకు కమ్యూనిస్టు భావజాలం ఇష్టమని చెబుతూ వచ్చారు.

Update: 2024-03-22 09:35 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే తాను చెగువెరా స్పూర్తిని తీసుకున్నానని తనకు కమ్యూనిస్టు భావజాలం ఇష్టమని చెబుతూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఆయన ఆ పదజాలాన్ని వాడడం లేదు. దానికి కారణం బీజేపీతో మితృత్వం. ఆ పార్టీతో కలసి ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు సుదీర్ఘకాలం మోడీ అధికారంలో ఉండాలని పవన్ గట్టిగా కోరుకుంటున్నారు

ఇదిలా ఉంటే పవన్ 2014 నుంచి 2024 మధ్యలో చాలా పార్టీలతో చెలిమి చేశారు. అవి చూస్తే కనుక 2014లో టీడీపీ బీజేపీ ఆ తరువాత 2919 వచ్చేనాటికి ఉభయ వామపక్షాలు, బీఎస్పీ వంటి వాటితో ఎన్నికల గోదాలోకి దిగారు. 2020 నుంచి బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ 2023లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. 2024 ఎన్నికల కోసం మూడు పార్టీలూ కలిశాయి. కూటమి కట్టాయి.

ఇదిలా ఉంటే పవన్ రాజకీయ విధానాల మీద ప్రత్యర్ధులు తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారు అని కూడా విమర్శిస్తూ ఉంటాయి. కానీ తొలిసారిగా పవన్ మీద మావోయిస్టులు విమర్శలు చేశారు. అది కూడా తీవ్ర స్థాయిలో.

తాజాగా చూస్తే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మావోయిస్టు అగ్రనేత గణేశ్ లేఖ విడుదల చేశారు. పవన్ పై ఈ లేఖలో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ స్థాపించిన రోజు తమ పార్టీ కమ్యూనిస్టు భావజాలం గల పార్టీ అంటూ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదన్నారు.

ఆయనకు విశ్వసనీయత లేదంటూ హాట్ కామెంట్స్ చేయడం విశేషం. అంతే కాదు రాజకీయ నేతగా చూస్తే కనుక పవన్ కల్యాణ్ కు విశ్వసనీయత చాలా తక్కువ అని గణేశ్ తాను రాసిన లేఖలో కోరారు. సినీ గ్లామర్, కాపు కులస్థుల గుర్తింపుతో రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికగా మారిందని మావోయిస్టు గణేష్ తాను రాసిన లేఖ లో పేర్కొన్నారు.

మొత్తం మీద ఈ లేఖ పవన్ కి షాక్ గా మారింది. ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ తాను ఒకదశలో మావోయిస్టులలో కూడా కలసి పనిచేయాలనుకున్నానని ప్రచారంలో ఉంది. మరి కమ్యూనిస్టు భావజాలం పట్ల మావోల పట్ల పవన్ సానుభూతిగా ఉంటే మావోల వైపు నుంచి మాత్రం ఆయనకు ఘాటు లేఖలు వస్తున్నాయి. దీనికి జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News