వైసీపీ ఉప్పు - టీడీపీ నిప్పు.. కలిశాయి.. ఏక్షణమైనా జంపేనా..!
ఇక్కడ వైసీపీకి బలంగా ఉన్న మర్రి రాజశేఖ ర్.. వ్యవహారం మలుపు తిరుగుతున్నట్టు తెలుస్తోంది.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఇప్పుడున్నట్టు రేపు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండాలనేమీ లేదు. ఇప్పు డు వైసీపీలోనూ అలానే జరుగుతోంది. చాలా మంది నాయకులు తమకు సేఫ్‌గా ఉన్న జోన్లను వెతుక్కుం టున్నారు. పార్టీఏదైనా ఫర్వాలేదన్న ధోరణిలోనూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరి పేట వైసీపీ రాజకీయాలు చర్చకు వస్తున్నాయి. ఇక్కడ వైసీపీకి బలంగా ఉన్న మర్రి రాజశేఖ ర్.. వ్యవహారం మలుపు తిరుగుతున్నట్టు తెలుస్తోంది.
రాజశేఖర్ త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే.. ఇలా జరగడానికి వైసీపీ అధినేత తీసుకుంటున్న నిర్ణయమే కారణమని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి, 2019లో చిలకలూరిపేట నుంచి విజయం దక్కించుకున్న విడదల రజనీ.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. దీంతో ఆమె తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయేందుకు రంగం రెడీ చేసుకుంటున్నారు.
దీనికి వైసీపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు సమాచారం. అయితే.. ఇలా విడదల రజనీ.. తిరిగి చిలకలూరి పేటలో అడుగు పెట్టేందుకు స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు ససేమిరా అంటున్నారు. పార్టీ కోసం.. అనేక త్యాగాలు చేసిన మర్రి రాజశేఖర్‌కి ఇక్కడ ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చి.. వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వాలని తీర్మానం చేశారు. అయితే.. దీనిపైఅధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిణామాలు ఇలా.. ఉంటే.. మర్రి మరో అడుగు ముందుకు వేశారు.
తనతో గత పదేళ్ల పాటు ఉప్పునిప్పుగా వ్యవహరించిన టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో చేతులు కలిపారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తాజాగా ఈ నెల 21న జరిగిన పోలీసుల అమరవీరుల కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్నారు. ఒకరికొకరు పలకరించుకున్నారు. ఇదేసమయంలో ఏకాంతంగా కూడా కొద్ది సేపు ఇద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం. దీనిని బట్టి.. మర్రి-ప్రత్తిపాటి ఏకమయ్యారన్న చర్చ సాగుతోంది. రేపు విడదల కనుక పేటలోకి ఎంట్రీ ఇస్తే.. మర్రి టీడీపీలోకి జంప్ చేయడం ఖాయమన్న వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం.