ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.. ఇంటికెళ్లండి: జీవిత ఖైదీలకు సర్కార్ ఆఫర్!!
మీరు చదివింది నిజమే. ఇంకా మే నెల కూడా రాకుండానే ఎండలు మండిపోతున్నాయి.
మీరు చదివింది నిజమే. ఇంకా మే నెల కూడా రాకుండానే ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. దీంతో చిన్నా పెద్ద అసలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక, మధ్యవయసు వారు కూడా.. ఒకింత బలంగా ఉన్నవారు కూడా.. ఎండవేడిమికి ముందుగానే పనులు ముగించుకుని ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇక, ఆఫీసుల్లో ఏసీలు నిరంతరాయంగా తిరుగుతున్నా యి. మన దేశంలో దాదాపు అన్ని రాస్ట్రాల్లోనూ ఇదే పరిస్తితి నెలకొంది.
ఇక, పొరుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో మన దగ్గర ఎలా ఉన్నా.. మయన్మార్ దేశంలో మా త్రం ప్రభుత్వం సంచలన నిర్నయం తీసుకుంది. ఈ దేశంలో వడగాడ్పులు ఎక్కువగా ఉన్నాయి. అదేవి ధంగా ఎండలు కూడా ఠారెత్తిస్తున్నాయి. దీంతో వృద్ధులు, చిన్నారుల పరిస్థితి ఉక్కిరిబిక్కిరిగా మారింది. దీనిని తట్టుకునేందుకు మయన్మార్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాటర్‌ను సఫిషియంట్‌గా ఇస్తోంది. ఇంటింటికీ.. మజ్జిగ పంపిణీ చేస్తోంది. దీనినొక ప్రభుత్వ పథకంగా అమలు చేస్తోంది.
ఇక్కడే మయన్మార్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. ఎండల తీవ్రత జైళ్లలో ఉన్న ఖైదీలపై ఎక్కువగా పడడంతో వారిని ఇంటికి పంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే... ఒకే ఒక్క కండిషన్ పెట్టింది.. 60 ఏళ్లు బడిన వారిని మాత్రమే పంపించాలని సూచించింది. దీంతో 60 ఏళ్లు పైబడిన ఖైదీలను ఎలాంటి షరతులు లేకుండానే.. పోలీసులు తమ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకువెళ్లి ఇళ్లలో దిగబెడుతున్నారు. ఇలా.. విడుదలైన వారిలో ప్రముఖులు ఉండడం గమనార్హం.
ఉద్యమకారిణి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మాజీ నేత ఆంగ్‌సాన్ సూకీ. మాజీ అధ్యక్షుడు యు విన్ మియింట్(72)ను కూడా విడిచి పెట్టారు. వీరితోపాటు మరికొందరిని కూడా విడుదల చేశారు. అయితే. వీరు ఇంటి నుంచి బయటకు రాకూడదు. ప్రభుత్వమే వారికి అవసరమైన ఆహారాన్ని అందిస్తుంది. అదేవిధంగామందులు కూడా ఇస్తుంది. ఇదీ సంగతి!!
కొసమెరుపు ఏంటంటే.. మన దేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీలుదాటిపోతే(ఏపీలో).. మయన్మార్‌లో ఈ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలే కావడం గమనార్హం. అయితే.. అక్కడ వడగాడ్పులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సర్కారు ఇలా ఖైదీలను విడుదల చేస్తోంది.