బాబుతో బాబు...గుడ్ న్యూసేనా బాబూ ?
ఆయన అతి రధ మహారధుడు. అపర చాణక్యుడు. రాజకీయ దురంధరుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ ఆయన ఎప్పటికీ బాబుగానే చిర పరిచితం.;

ఆయన అతి రధ మహారధుడు. అపర చాణక్యుడు. రాజకీయ దురంధరుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ ఆయన ఎప్పటికీ బాబుగానే చిర పరిచితం. ఇక మరో ఆయన మెగా బ్రదర్. ఆరడుగులకు పైగా ఉన్నా ఆయనలో యాక్టివ్ నెస్ మాత్రం అధ్బుతం. మెయిన్ గా సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ సెపరేటు రూట్. ఘనమైన సినీ నేపథ్యం ఉన్నా రాజకీయం వైపు తమ్ముడితో పాటు వచ్చిన ఆయనే కొణిదెల నాగబాబు. ఆయన ఆరున్నర పదుల జీవితంలో వరించి వచ్చిన అదృష్టం గా ఎమ్మెల్సీ పదవి దక్కింది.
నాగబాబుని ఎమ్మెల్సీగా చేయడంతో తమ్ముడు జనసేన అధినేత పట్టుదల ఎంత ఉందో అంతే స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులూ ఉన్నాయి. పైగా ఇప్పటికి మూడు నెలల క్రితమే నాగబాబు పేరుని ప్రస్తావిస్తూ తన మంత్రివర్గ సహచరుడిగా చేసుకుంటాను అని సోషల్ మీడియా సాక్షిగా బాబు వేసిన ట్వీట్ కూడా ఉంది. అది ఒక్క నాగబాబుకే స్పెషల్. పదవుల విషయంలో ఇలా అడ్వాన్స్ గా చెప్పి మరీ ఉత్సాహపరచిన సందర్భం బాబు గారిలో అయితే గతంలో లేదు. ఆ అరుదైన ఘనతను అందుకున్న వారు అచ్చంగా నాగబాబే.
బాబు అన్నారూ అంటే చేస్తారు. పైగా జనసేనతో స్ట్రాంగ్ ఎమోషనల్ బాండేజ్ ఉంది. సో ఒక రోజూ అటూ ఇటూ అంటే. నాగబాబు జస్ట్ ఎమ్మెల్సీ కాదు, మినిస్టర్ నాగబాబే. ఆ ముహూర్తం కోసమే అంతా వెయిటింగ్. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన వెంటనే కూటమి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుని వెళ్ళి కలసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నాగబాబు హుందాతనానికి సమయస్ఫూర్తికి నిదర్శనంగా భావిస్తున్నారు. ఇక బాబు సైతం ఆయన్ని మనసారా అభినందించారు ఇలా బాబు విత్ బాబు ఫోటో అయితే సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.
ఆ మంచి ముహూర్తం ఎపుడూ అంటే వేచి ఉంటేనే కదా మజా అన్నది అందరి మాట. ఏది ఏమైనా నాగబాబు చట్ట సభలోకి వచ్చారు. ఇక తనదైన వాణిని బాణిని చూపించబోతున్నారు. సో కంగ్రాట్స్ టూ మెగా బ్రదర్ నాగబాబూ అని చెప్పాల్సిందే.