పిఠాపురం కాదు మెగా పురం...పవన్ ప్లాన్ అదేనా ?

వీటితో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే మెగాస్టార్ చిరంజీవి కొత్త మూవీ విశ్వంభర ప్రీ రిలీజ్ ఫంక్షన్ పిఠాపురంలో నిర్వహిస్తారు అని అంటున్నారు.

Update: 2024-08-17 07:14 GMT

ఏపీలో పవన్ కి సొంత నియోజకవర్గం ఈదీ అంటే అది ఒక బిగ్ క్వశ్చన్. దాని మీద జనసేన అధినేత హోదాలో పవన్ సభలలో ఒక మాట అంటూ ఉండేవారు. తాను అందరి వాడిని అని అనుకున్నానని చెప్పేవారు. తనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఉండాలన్న ఆలోచన కూడా లేదు అని ఆయన మధనపడేవాడు. అయితే ఇపుడు పవన్ కేరాఫ్ పిఠాపురం అని చెప్పుకోవాలి. ఆయనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఏర్పడింది.

అది కూడా పవన్ అంటే ఎంతో ఇష్టం తో కూడిన అభిమాన జనం నీరాజనం పడుతోంది. పవన్ కూడా తన మంత్రిత్వ శాఖలలో ఏ కొత్త నిర్ణయం తీసుకునన ప్రయోగాత్మకంగా పిఠాపురం నుంచే ప్రారంభించాలని ఆదేశిస్తున్నారు. ఇక పవన్ పిఠాపురంలో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు.

పవన్ సోదరుడు నాగబాబు తమ్ముడు నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్నారు. పవన్ అందుబాటులో ఉన్నా లేకున్నా నాగబాబు మాత్రం జనసైనికులకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. జనసేనకు లభించిన ఏకైక ఎమ్మెల్సీ సీటుని గెలిచిన హరిప్రసాద్ కూడా పిఠాపురాన్ని దత్తత తీసుకుంటాను అని చెప్పారు.

ఇక జనసేన నాయకులు పలువురు పిఠాపురంలోని గ్రామాలను దత్తత తీసుకోవడానికి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక బ్రహ్మాండమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటి అంటే ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ పిఠాపురానికి గట్టి మేలు తలపెడుతున్నారు. అపోలో ఆసుపత్రిని అక్కడ భారీ ఎత్తున నిర్మించాలని చూస్తున్నారు. దీని కోసం అవసరమైన భూమిని తీసుకోవాలని అనుకుంటున్నారు.

అత్యాధునిక సదుపాయాలతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగితే ఒక్క పిఠాపురానికే కాదు చుట్టు పక్కన ప్రాంతాలకు వైద్య పరంగా ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన అపోలో యాజమాన్యానికి చెందిన వ్యక్తి కావడంతో పిఠాపురాన్ని వారు ఎంచుకుని తొందర్లోనే తమ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

ఇక మెగా హీరోలు పెద్ద ఎత్తున ఉన్నారు. వారంతా కూడా తమకు తోచిన తీరున పిఠాపురంలోని గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పవన్ పుణ్యమాని పిఠాపురంలోని భూములకు ధరలు పెరిగాయి. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పవన్ కోసమే అక్కడ భూములు కొనుగోలు చేస్తూ తమ ప్రాజెక్టులు పెట్టాలని అనుకుంటున్నారు.

వీటితో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే మెగాస్టార్ చిరంజీవి కొత్త మూవీ విశ్వంభర ప్రీ రిలీజ్ ఫంక్షన్ పిఠాపురంలో నిర్వహిస్తారు అని అంటున్నారు. మొత్తానికి ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు ఉంటే పిఠాపురాన్ని వాటిలో ఒకటి కాకుండా వేరే లెవెల్ కి తీసుకుని వెళ్తాను అని పవన్ ఎన్నికల్లో చెప్పినట్లుగా చేస్తున్నారు అని అంటున్నారు.

పిఠాపురం కాదు అది మెగా పురం పవన్ కి అది ఇక మీదట శాశ్వత నియోజకవర్గం అని అంటున్నారు. పవన్ తన రాజకీయ జీవితంలో కొనసాగినన్నాళ్ళూ పిఠాపురం నుంచే పోటీ చేస్తారు అని కూడా అంటున్నారు. సో పిఠాపురం రూపు రేఖలు మారుతున్నాయన్న మాట.

Tags:    

Similar News