మాజీ సీఎం కుమార్తె ఓటమి... కార్యకర్తలకు కృతజ్ఞతలు!

శ్రీగుఫ్వారా బిజ్ బెహరా నియోజకవర్గం నూంచి పీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తన ఓటమిని అంగీకరించారు.

Update: 2024-10-08 08:49 GMT

జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇది కచ్చితంగా బలమైన మార్పుకు సంకేతమనే కామెంట్లు నాడు వినిపించాయి. ఈ సమయంలో తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

అవును... కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్ లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాలో 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటూ నేషనల్ కాన్ఫరెన్స్ దూసుకుపోతోంది. ఇదే సమయంలో ఆ పార్టీతో కూటమిలో ఉన్న కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది.

మరోపక్క భారతీయ జనతా పార్టీ 26 స్థానాల్లోనూ, ఇతరులు 9 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉండగా అనూహ్యంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) 2 స్థానాల్లో మాత్రమే ఇప్పటివరకూ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సమయంలో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబాబా ముఫ్తీ కుమార్తె స్పందించారు.

ఇందులో భాగంగా... శ్రీగుఫ్వారా బిజ్ బెహరా నియోజకవర్గం నూంచి పీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తన ఓటమిని అంగీకరించారు. నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ముగిసేసరికీ ఆమె ఎన్సీ నేత బషీర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన ఆమె ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు తెలిపారు.

ఈ మేరకు ఎక్స్ లో స్పందించిన ఇల్తీజా ముఫీ... ప్రజల తీర్పును తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. బిజ్ బెహరాలో ప్రతీ ఒక్కరి నుంచీ తనకు లభించిన ప్రేమ, ఆప్యాయత ఎల్లప్పుడూ తనతో ఉంటుందని అన్నారు. ఈ ప్రచారంలో కష్టపడి పనిచేసిన పీడీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News