ఓపెన్ ఏఐ సోషల్ మీడియా యాప్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్!
మెటా ఏఐ యాప్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందన్న వార్తలు చక్కర్లు కొడుతోన్న వేళ.. శామ్ ఆల్టమన్ స్పందించారు.
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, థ్రెడ్స్ అంటూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ తో మెటా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోనూ తన సేవల్ని మరింత మెరుగుపరచాలని చూస్తోంది. దీనికోసం ఏఐ యాప్ ను విడుదల చేసేందుకు మెటా సన్నాహాలు చేస్తోందనే కథనాలు ఇటీవల హల్ చల్ చేస్తున్నాయి.
మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఓపెన్ ఏఐ సంస్థ దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా.. చాట్ జీపీటీ, చాట్ బాట్ సేవలతో సంచలనాలు సృష్టిస్తోంది. ఇదే సమయంలో.. మెటా నూంచి పోటీని ఎదుర్కోంటుందని అంటున్నారు. ఈ సమయంలో... మెటా ఏఐ యాప్ వార్తలపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ స్పందించారు.
అవును... మెటా ఏఐ యాప్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందన్న వార్తలు చక్కర్లు కొడుతోన్న వేళ.. శామ్ ఆల్టమన్ స్పందించారు. ఇందులో భాగంగా.. అదే నిజమైతే తాము కూడా ఓ సోషల్ మీడియా యాప్ ను తీసుకొస్తామని ఓపెన్ ఏఐ సీఈవో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆల్టమన్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
ఇందులో భాగంగా... ఫేస్ బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్ ను తీసుకురావాలని చూస్తుంటే.. తాము కూడా సోషల్ మీడియా యాప్ ను తీసుకొస్తామని.. అప్పుడు అది ఫన్నీగా ఉంటుందని ఆల్టమన్ పేర్కొన్నారు.
కాగా... 2023లోనే మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా.. ఇమేజ్ జనరేషన్ ఆప్షన్స్ నూ అందిస్తోంది. ఈ సమయంలో ఏఐ సేవల్ని మరింత చేరువ చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే సోషల్ మీడియా సెర్చ్ బార్ లో ఈ సేవల్ని జోడించింది.
మరోవైపు.. ఈ విభాగంలో సేవలు అందిస్తున్న ఓపెన్ ఏఐ, గూగుల్ సంస్థలకు గట్టిపోటీ ఇవ్వాలని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చూస్తున్నారని అంటున్నారు. అందుకోసం ఈ ఏడాది సుమారు 65 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే... ఏఐ స్పెషల్ యాప్ విషయంలో మాత్రం మెటా నుంచి అధికారిక ప్రకటన ఏమీ రాలేదు!