ఫేస్ బుక్ సీఈఓకు పాక్ లో మరణ శిక్ష... జుకర్ బర్గ్ కామెంట్స్ వైరల్!

ఈ నేపథ్యంలో ఎవరో ఫేస్‌ బుక్‌ లో పెట్టిన పోస్టు కారణంగా పాకిస్థాన్‌ లో తనకు మరణశిక్ష విధించాలని చూస్తున్నారని మెటా సీఈఓ జుకర్‌ బర్గ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Update: 2025-02-12 11:34 GMT

పాకిస్థాన్ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరో ఫేస్‌ బుక్‌ లో పెట్టిన పోస్టు కారణంగా పాకిస్థాన్‌ లో తనకు మరణశిక్ష విధించాలని చూస్తున్నారని మెటా సీఈఓ జుకర్‌ బర్గ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో... అసలు ఫేస్ బుక్ సీఈఓకు పాక్ లో మరణ శిక్ష ఎందుకు అనే విషయం వైరల్ గా మారింది.

అవును... తాజాగా.. జో రోగన్‌ పాడ్‌ కాస్ట్‌ లో పాల్గొన్న జుకర్‌ బర్గ్‌ ఈ మేరకు స్పందిస్తూ.. పాకిస్థాన్‌ లో ఫేస్‌ బుక్‌ సంస్థపై నమోదైన దావా గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వివిధ దేశాల్లో తాము అంగీకరించని చాలా చట్టాలున్నాయని.. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్థాన్‌ లో తనకు మరణశిక్ష విధించాలంటూ ఎవరో దావా వేశారని తెలిపారు.

ఈ సందర్భంగా... ఎవరో ఫేస్‌ బుక్‌ లో దేవుడిని అవమానిస్తూ ఉన్న చిత్రాలను పోస్టు చేయడమే అందుకు కారణమని.. ఇది ఎక్కడివరకు వెళ్తుందో తనకు తెలియదని.. తనకు ఆ దేశానికి వెళ్లాలని లేదని.. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ జుకర్ బర్గ్ తెలిపారు.

ఈ సందర్భంగా.. భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు వివిధ దేశాల్లో పాటించే పలు విలువలపై నిబంధనలు ఉన్నాయని అన్నారు. దీంతో యాప్‌ లోని చాలా కంటెంట్‌ ను అణచివేయాల్సి వస్తోందని.. ఆయా దేశాల ప్రభుత్వాలు సైతం మమ్మల్ని జైల్లో పడేసేంత శక్తివంతంగా ఆ నిబంధనలు ఉంటాయని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే... విదేశాలలో ఉన్న అమెరికన్‌ టెక్‌ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వం సాయం అందించాలని భావిస్తున్నట్లు జుకర్‌ బర్గ్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News