రూపాయి మ‌హిమ‌: మ‌ధ్య‌త‌ర‌గ‌తిపై మ‌హా భారం.. !

అయితే, ఈ ప్ర‌భావం భార‌త దేశంలోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై మ‌హాభారంగా ప‌రిణ‌మించ‌డం ఖాయ‌మ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Update: 2023-09-08 09:30 GMT

రూపాయి మ‌హిమ‌... మామూలుగా క‌నిపించ‌డం లేదు. వ‌రుస‌గా నాలుగో రోజూ అంత‌ర్జాతీయ మార్కెట్‌లో భార‌త‌ రూపాయి విలువ మ‌రింత‌ క్షీణించింది. ప్ర‌స్తుత అంత‌ర్జాతీయ విప‌ణిలో డాలరుతో పోలిస్తే 10 పైసలు కోల్పోయి 83.23 వద్ద ముగిసింది. దేశం నుంచి విదేశీ మూలధన పెట్టుబడులు బయటకు వెళ్లడం, అంతర్జాతీయంగా అమెరికన్‌ కరెన్సీ బలోపేతం కావడం ఇందుకు కారణాలుగా నిలిచాయి. అయితే, ఈ ప్ర‌భావం భార‌త దేశంలోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై మ‌హాభారంగా ప‌రిణ‌మించ‌డం ఖాయ‌మ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఏం జ‌రుగుతుంది? సాధార‌ణంగా రూపాయి విలువ క్షీణించిన ప్ర‌తిసారీ దేశ‌వ్యాప్తంగా ధ‌ర‌లు పెరుగుతాయి. దీనినే ద్ర‌వ్యోల్బ ణం అని కూడా అంటారు. అంటే... నిత్యావ‌సరాల నుంచి అన్ని ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం మెండుగా ఉంది. ఇది ఇప్ప‌టికిప్పుడు మ‌న‌కు క‌నిపించ‌క‌పోయినా.. కొద్ది వారాల్లోనే మార్పులు ఖాయ‌మ‌ని నిపుణులు అం టున్నారు. ప్ర‌ధానంగా విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే ప్ర‌తి వ‌స్తువూ.. ధ‌ర‌లు పెరిగిపోవ‌డం ఖాయం గా క‌నిపిస్తోంది.

అంటు,, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా.. పెర‌గ‌కున్నా.. దేశీయంగా మాత్రం చాలా సొమ్ము వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంది. దీంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌లు రెండు మూడు వారాల్లోనే భారీగా పెరుగుతాయ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. రూపాయి విలువ ప‌డిపోవ‌డంతో దేశ దిగుమతి బిల్లులు పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ అవ‌కాశం ఉంది.

రూపాయి ప‌త‌నానికి కార‌ణాలు ఇవీ..

- డ్రాగ‌న్ కంట్రీ చైనా నుంచి న‌ష్ట‌పూరిత‌ వాణిజ్య గణాంకాలు వెలువడడం

- గతేడాది కనిష్ఠ స్థాయికి పడ్డ చైనీస్‌ యువాన్‌లో తాజా బలహీనతలు మన రూపాయి బలహీనపడేలా చేశాయి.

- స్టాక్‌మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్లు నికర విక్రేతలుగా మారి రూ.758.55 కోట్ల విలువైన షేర్లను అమ్మ‌డం.

- చమురు ఉత్ప‌త్తి చేసే ఒపెక్ దేశాలు డిసెంబరు వరకూ సరఫరా కోతను కొనసాగించాలని నిర్ణయించ‌డం.

Tags:    

Similar News