కోటీశ్వరులైన ట్యాక్స్ పేయర్లు... తెరపైకి కీలక విషయాలు!

ఇదే సమయంలో పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి.

Update: 2024-10-28 02:30 GMT

భారతదేశంలో గడిచిన పదేళ్లలో టాక్స్ పేయర్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పాటు కోటీశ్వరులైన పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఇన్ కం ట్యాక్స్ అసెస్ మెంట్ ఇయర్ 2024లో 2014 ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు పెరిగి 2.2 లక్షలకు చేరుకుందని తాజా నివేదిక వెళ్లడించింది. ఇదే సమయంలో పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి.

అవును.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ డిపార్ట్మెంట్ పరిశోధనకు సంబంధించిన నివేదికలో ట్యాక్స్ పేయర్స్ తో పాటు కోటీశ్వరులైన ట్యాక్స్ పేయర్స్ కూడా భారీగా పెరిగినట్లు తెలిపింది! ఇందులో భాగంగా... గత 10 అసెస్ మెంట్ ఇయర్స్ తో పోలిస్తే 2024లో మొత్తం ట్యాక్స్ పేయర్స్ సంఖ్య 2.3 రెట్లు పెరిగి 8.62 కోట్లను చేరుకున్నట్లు తెలిపింది.

ఇదే సమయంలో... అసెస్ మెంట్ ఇయర్ 2022లో 7.3 కోట్లుగా ఉన్న మొత్తం ఇన్ కం ట్యాక్స్ పేయర్స్ రిటర్న్స్ 2024 అసెస్ మెంట్ ఇయర్ నాటికి 8.6 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. వీటిలో 79 శాతం (6.89) కోట్ల రిటర్నులు గడువు తేదీలో లేదా.. అంతక ముందే దాఖలు చేయబడ్డాయని పేర్కోంది.

ఈ క్రమంలో... సమర్ధవంతమైన, డిజిటల్ భారీ ఫైలింగ్, వెరిఫికేషన్ లో సమస్యలు లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నిరంతర ప్రయత్నాల ద్వారా నడిచే ఐటీ ఫారం లతో పాటు, ప్రక్రియల సరళీకరణతో పటు పను చెల్లింపుదారులలో ఉన్న క్రమశిక్షణ కూడా దీనికి కారణం అని ఎస్బీఐ నివేదిక పేర్కొంది.

ఈ విధంగా 2015 అసెస్ మెంట్ ఇయర్ కంటే 2024 లో 5.1 కోట్ల ఐటీఆర్ లు దాఖలు చేయబడ్డాయి. ఇందులో గరిష్ట పెరుగుదల మహారాష్ట్రలో నమోదవ్వగా.. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఇదే సమయంలో... చిన్నరాష్ట్రాలైన మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ లలో 20శాతానికి పైగా వృద్ధి నమోదు అయ్యింది.

ఇక వ్యక్తిగత పన్ను దాఖలు చేసేవారిలో సుమారు 15శాతం మంది మహిళా ట్యాక్స్ పేయర్స్ ఉనట్లు నివేదిక చెబుతుంది! ఈ విషయంలో కేరళ, తమిళనాడు, పంజాబ్, వెస్ట్ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో.. మహిళా ట్యాక్స్ పేయర్స్ విషయంలో అధిక వాటాను కలిగి ఉన్నాయి!

Tags:    

Similar News