నాగబాబుకు అందుకేనా మంత్రి పదవి ?

ఇదిలా ఉంటే నాగబాబుకు మంత్రి పదవి వరించడం వెనక చాలా సమీకరణలు పనిచేశాయని అంటున్నారు. అంతే కాదు భారీ వ్యూహాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

Update: 2024-12-11 08:30 GMT

జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు కు మంత్రి పదవి అంటే అది ఒక్కసారిగా వైరల్ అయింది. ఎందుకంటే నాగబాబు 2024 ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. ప్రస్తుతానికి ఆయన ఏ చట్ట సభలోనూ సభ్యుడు కారు, అటువంటి నాగబాబుకు హఠాత్తుగా అమాత్య కిరీటం వరించి వస్తే అంతకంటే హాట్ టాపిక్ పొలిటికల్ గా ఏమి ఉంటుంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే నాగబాబుకు మంత్రి పదవి వరించడం వెనక చాలా సమీకరణలు పనిచేశాయని అంటున్నారు. అంతే కాదు భారీ వ్యూహాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నాగబాబుకు మంత్రి పదవి దక్కడం అన్న దాని వెనక ఏమి జరిగి ఉంటుంది అన్నది చూస్తే ఆసక్తికరంగానే ఉందని అంటున్నారు.

నిజానికి నాగబాబు ఎంపీ కావాలని అనుకున్నారు. ఆయన 2019లో నరసాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2024 లో అనకాపల్లి నుంచి ఎంపీగా అయ్యేందుకు ప్రచారం స్టార్ట్ చేసి అంతా సిద్ధం చేసుకుని డ్రాప్ అయ్యారు. పొత్తుల కారణంగా ఆయన సీటు బీజేపీకి వెళ్ళింది.

ఇక నాగబాబు పార్లమెంట్ మెట్లు ఎక్కాలీ అంటే మరో మార్గమే లేదా అంటే ఎందుకు లేదూ రాజ్యసభ ఉంది అని కూడా చెప్పవచ్చు. మరి రాజ్యసభ ద్వారా నాగబాబు వెళ్లాల్సింది ఎమ్మెల్సీగా అయి ఏపీలో మంత్రిగా ఎందుకు కుదురుకుంటున్నారు అన్నదే కదా ఎడ తెగని చర్చ.

ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉంది. నాగబాబు రాజ్యసభకు నెగ్గితే కచ్చితంగా కేంద్ర కేబినెట్ లో ఆయనకు బెర్త్ ఖాయంగా ఉంటుంది. పవన్ అంటే ఎంతో ఇష్టపడే ప్రధాని నరేంద్ర మోడీ ఆయన పార్టీకి కూడా ఒక కేబినెట్ బెర్త్ కచ్చితంగా ఇస్తారు. రెండు ఎంపీలు ఉన్న జేడీఎస్ కి కేబినెట్ మినిస్టర్ ఇవ్వగా లేనిది అదే రెండు ఎంపీలు ఉన్న నమ్మకమైన జనసేనకు ఎందుకు ఇవ్వరు. అలా చూస్తే కనుక నాగబాబు డ్యాం ష్యూర్ గా కేంద్ర మంత్రి అయి తీరుతారు అన్న మాట.

మరి ఆయన కేంద్ర మంత్రి అయితే ఆ లెక్కే వేరు కదా. ఆ దర్జాయే వేరు కదా. నిజానికి కేంద్రంలో జనసేన చక్రం తిప్పేందుకు కూడా ఎంతో వీలు ఉంటుంది. మరి అంతటి గోల్డెన్ చాన్స్ ఎందుకు వదులుకున్నారు అంటే జనసేన అధినాయకత్వం ఏమీ అలా ఆలోచించలేదు, ఏ చాన్సూ వదులుకోలేదు.

అయితే ఇక్కడే టీడీపీ మంత్రాంగం మీద అందరికీ డౌట్లు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో జనసేన ప్రభ వెలగకుండా నాగబాబుని ఏపీలోనే మంత్రిగా చేసి ఇక్కడే ఉంచుతున్నారు అని అంటున్నారు. నాగబాబుకు కేంద్ర మంత్రి పదవి రావడం అన్నది నారా లోకేష్ కి ఇష్టం లేదు అన్నది పుకారుగా ఒక వార్త షికారు చేస్తోంది.

కేంద్ర మంత్రివర్గంలో ఉంటే టీడీపీయే ఏపీ నుంచి ఉండాలి తప్ప జనసేన ఉండరాదు అన్న ఆలోచన ఏదో ఉంది అని అంటున్నారు. అలా లోకేష్ భావించడం వల్లనే నాగబాబుకు రాజ్యసభ సీటు దక్కకుండా పోయింది అని అంటున్నారు. ఇది జనసేనలో చర్చగా సాగుతోంది అని అంటున్నారు. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ఈ విధంగా ప్రచారం అయితే సాగుతోంది.

ఇక కేంద్రంలో మంత్రిగా నాగబాబు ఉంటే జనసేనకు ఎంతో పవర్ వస్తుందని అది టీడీపీకే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అది ఏ రకమైన ఇబ్బందో చెప్పడం లేదు, ఎలా వస్తుందో కూడా చెప్పడం లేదు కానీ మొత్తానికి నాగబాబుకు కేంద్ర మంత్రి పదవి రాకుండా బ్రేకులు వేశారు అన్నది మాత్రం చర్చ సాగుతోంది.

ఇక నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో పదవి ఆఫర్ చేయడం పట్ల కూడా జనసేనలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇలా ఒకే కేబినెట్ లో అన్నదమ్ములు మంత్రులుగా ఉండడం మంచి పరిణామమేనా అన్నది కూడా చర్చగా ఉంది. అంతే కాదు దీని వల్ల విపక్ష వైసీపీకి విమర్శించేందుకు అవకాశం ఇచ్చినట్లుగా ఉందని కూడా అంటున్నారు.

ఇక నాగబాబుకి మంత్రి పదవి ఇస్తే ప్రజలలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా బాగా తగ్గుతుంది అన్నది కూడా ఇంకో చర్చగా ముందుకు వస్తోంది. అంతా తమ ఇంట్లో వారికే పదవులు ఇప్పించుకుంటున్నారు అన్న భావన ఏర్పడితే అది జనసేన అభివృద్ధికి కూడా ఆటంకంగా మారుతుంది అని అంటున్నారు. అలా పవన్ క్రేజ్ కూడా పొలిటికల్ గా తగ్గుతుంది అని అంటున్నారు.

మరి ఇదంతా చేయడం వల్ల జనసేనకు లాభమా నష్టమా అంటే కచ్చితంగా నష్టమే అని అంటున్నారు. ఎటూ పవన్ ఏపీ కేబినెట్ లో ఉన్నారు. అందువల్ల మరో మంత్రి పోస్టు బలమైన ఇంకో సామాజిక వర్గానికి ఇప్పించుకుని నాగబాబుకు రాజ్యసభకు పంపించి అక్కడ కేంద్ర మంత్రిగా చేసుకుని ఉంటే పవన్ క్రేజే కాదు జనసేన ఫ్యూచర్ కూడా వేరే లెవెల్ లో ఉండేదని అంటున్నారు. మరి ఈ విషయంలో పవన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News