వైరల్: ఫోటోలు అడుగుతావా? టీ మంత్రి పేషీ ఉద్యోగి తాట తీస్తూ ఫోన్ కాల్

దీంతో.. వేదనకు గురైన సదరు క్రీడాకారిణి.. తనను మంత్రి పేషీకి తీసుకెళ్లిన బంధువుకు తనకు ఎదురైన వేధింపుల గురించి చెబుతూ.. ఆ మేసేజ్ లను ఫార్వార్డ్ చేసింది.

Update: 2023-08-15 04:15 GMT

తెలంగాణకు చెందిన మహిళా క్రీడాకారిణులు పలువురు చేతిలో వేధింపులకు గురి అవుతున్నారా? మొన్నటికి మొన్న హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఓఎస్డీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఒక కొలిక్కి రాకముందే తాజాగా మరో దుర్మార్గం వెలుగు చూసింది. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతున్న ఒక క్రీడాకారిణికి.. తెలంగాణ రాష్ట్ర క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో పని చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ సురేందర్ చేసిన నిర్వాకం తాజాగా వెలుగు చూసి సంచలనంగా మారింది.

జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆమెను మంత్రికి పరిచయం చేసేందుకు ఆమె బంధువు ఈ మధ్యన పేషీకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పరిచయమైన ఆమె నుంచి ఫోన్ నెంబరును తీసుకున్న పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసే సురేందర్ ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నాడు. నీ ఏజ్ ఎంత? నీ పర్సనల్ ఫోటోలు పంపు.. నీతో పర్సనల్ గా మాట్లాడాలి.. నిన్ను పర్సనల్ గా కలవాలంటూ మేసేజ్ లతో వేధిస్తున్నాడు.

దీంతో.. వేదనకు గురైన సదరు క్రీడాకారిణి.. తనను మంత్రి పేషీకి తీసుకెళ్లిన బంధువుకు తనకు ఎదురైన వేధింపుల గురించి చెబుతూ.. ఆ మేసేజ్ లను ఫార్వార్డ్ చేసింది. దీంతో.. సదరు బంధువు సురేందర్ కు ఫోన్ చేశాడు. తొలుత తనకేమీ తెలీదన్నట్లుగా మాట్లాడిన సదరు ఉద్యోగి.. ఎప్పుడైతే అతగాడు పంపిన మెసేజ్ లు తన వద్ద ఉన్నాయని.. వాటిని తీసుకొని మంత్రిని కలుస్తానని చెప్పటంతో ఒక్కసారిగా కాళ్ల బేరానికి వచ్చాడు. తాను చేసింది తప్పేనని ఒప్పేసుకొని.. దయచేసిన తన విషయంలో పెద్ద మనసు ప్రదర్శించాలని కోరాడు.

దీనికి సంబంధించిన రెండు వాయిస్ కాల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తన పేషీలో పని చేస్తూ.. తప్పుడు పనులకు పాల్పడిన సురేందర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా ఉంటూ ఎంతోమందికి సాయం చేస్తున్న నేత దగ్గర ఉంటూ.. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడతావా? అంటూ క్రీడాకారిణి బంధువు సదరు ఫోన్ కాల్ లో దుమ్మెత్తి పోశారు. తనను క్షమించాలని కోరిన సురేందర్ కు.. మెసేజ్ లతో వేధింపులకు గురి చేసిన బాధితురాలికి ఫోన్ చేసి సారీ చెప్పాలని.. ఆమె అంగీకరిస్తూ తానీ విషయాన్ని వదిలేస్తానని చెప్పటం ఒక ఎత్తు అయితే..తాజాగా ఫోన్ కాల్ ఆడియో లీక్ అయ్యింది. తప్పుడు పనులు చేసిన సురేందర్ కు తగిన శాస్తి జరిగిందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News