మంత్రి పార్థసారథి స్టేట్మెంట్ విన్నారా... జగన్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు!

అవును... గృహనిర్మాణ నిధులును గత ప్రభుత్వం దారి మళ్లించిందంటూ టీడీపీ నేత, గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-19 13:23 GMT

ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తాజాగా వైఎస్ జగన్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు గత ఐదేళ్లలో గృహ నిర్మాణ శాఖలో ఏమి జరిగింది, రిషికొండ నిర్మాణానికి సంబంధించిన నిధులు ఎక్కడవి మొదలైన విషయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు గత ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణ నిధులన్నీ ఎటు మల్లాయో తేలుస్తామని అన్నారు.

అవును... గృహనిర్మాణ నిధులును గత ప్రభుత్వం దారి మళ్లించిందంటూ టీడీపీ నేత, గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రిషికొండ నిర్మాణానికి గృహ నిర్మాణ నిధులను మళ్లించి ఉండొచ్చని కూడా ఆయన ఆరోపించారు. అదేవిధంగా... అసలు జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ ఇళ్లు అని చెప్పి సగం సగం పనులు మాత్రమే చేశారని విమర్శించారు.

ఇదే సమయంలో... గత ప్రభుత్వ హయాంలో 26 లక్షల ఇళ్లు అని హామీ ఇచ్చి కేవలం 6 లక్షలు మాత్రమే నిర్మించారని చెప్పిన పార్థసారథి... గడిచిన ఐదేళ్లలో గృహ నిర్మాణంలో రాష్ట్రం ఆఖరి స్థానంలో నిలిచిందని అన్నారు. అదేవిధంగా... గృహ నిర్మాణ శాఖకు ఇవ్వాల్సిన రూ.3,070 కోట్ల మేర నిధులు కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా... పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తిచేసే బాధ్యత టీడీపీ సర్కార్ తీసుకుందని అన్నారు. అదేవిధంగా గృహనిర్మాణాల నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే నిధులు దారి మళ్లించడంతో పాటు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేదని అన్నారు. గడిచిన ఐదేళ్లలో పశ్చిమ బెంగాల్‌ లో 45 లక్షల ఇళ్లు నిర్మిస్తే... ఏపీలో మాత్రం కేవలం 6.08 లక్షల ఇళ్లు మాత్రమే కట్టగలిగారని అన్నారు.

ఈ క్రమంలో దారిమళ్లించినట్లు సందేహపడుతున్న నిధులు రుషికొండకు మళ్లించారా? లేక.. ఇతర అంశాలకు మళ్లించారా అనేది తేలుస్తామని పార్థసారథి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... పేదల గృహాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీ రాజ్ నిధులూ అవసరమవుతాయని.. డిప్యూటీ సీఎం పవన్ తో మాట్లాడి నిధుల కల్పనపై ఫోకస్ పెడతామని మంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News