జగన్ ను అడ్డంగా బుక్ చేసిన సలహాదారుల బ్యాచ్!

ఇదంతా చూస్తే.. జగన్ రాసిన లేఖ లోని అంశాలకు సంబంధించిన కంటెంట్ ఇచ్చిన సలహాదారులు ఆయన్ను అడ్డంగా బుక్ చేశారంటున్నారు.

Update: 2024-06-26 07:16 GMT

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతను ఎంపిక చేయటానికి ప్రత్యేకించి ఎలాంటి విధానం లేదని.. మొత్తం సీట్లలో పదిశాతం నిబంధన ఎక్కడా లేదంటూ ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాయటం తెలిసిందే. తన సుదీర్ఘ లేఖలో బోలెడన్ని అంశాల్ని పేర్కొన్నారు. అయితే.. ఆయన ప్రస్తావించిన పలు అంశాలు అసత్యాలు.. అర్థసత్యాలే ఉండటం షాకింగ్ గా మారింది.

ఇదంతా చూస్తే.. జగన్ రాసిన లేఖ లోని అంశాలకు సంబంధించిన కంటెంట్ ఇచ్చిన సలహాదారులు ఆయన్ను అడ్డంగా బుక్ చేశారంటున్నారు. చరిత్రను ప్రస్తావించినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని.. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని మాత్రమే ప్రస్తావించాలి. కానీ.. జగన్ మాత్రం తన లేఖలో ఇష్టారాజ్యంగాఅర్థసత్యాలతో తన లేఖను నింపేశారు. ఈ లేఖపై ఇప్పుడు జరుగుతున్న చర్చ సందర్భంగా.. సీనియర్ రాజకీయ నేతలు మాత్రమే కాదు సీనియర్ పాత్రికేయులు సైతం అవాక్కు అవుతున్నారు. ఇలా తప్పుడు ఫీడ్ బ్యాక్ జగన్ కు ఇవ్వటమా? అన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటి సమాచారం మిస్ ఫైర్ కావటమే కాదు.. ప్రజల్లో చులకన అవుతామన్న ఆలోచన లేకపోవటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

ఒక పార్టీ అధినేతగా చరిత్రను.. చరిత్రలో చోటు చేసుకున్న ఆన్ రికార్డుగా ఉన్న అంశాలకు తనదైన రీతిలో భాష్యం పలికిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. తన పేరు మీద స్పీకర్ కు వెళ్లే లేఖలో అసత్యాలు పేర్కొనటం.. చరిత్రలో జరిగిన వాటిని తప్పుగా కోట్ చేయటం వల్ల నష్టమేనంటున్నారు. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇలాంటి వాటితో అడ్డంగా దొరికిపోయినట్లు అవుతుందని చెబుతున్నారు. స్పీకర్ కు రాసిన లేఖలో ప్రస్తావించిన పలు అంశాల్లో ఎలాంటి నిజం లేదని.. అసలు వాస్తవం ఇదంటూ పలువురు తమ వాదనలు వినిపిస్తున్నారు.

జగన్ లేఖలో పేర్కొన్న అంశం 1

పర్వతనేని ఉపేంద్ర 1984లో లోక్ సభ సభ్యుడిగా పేర్కొన్నారు

వాస్తవం 1

పర్వతనేని ఉపేంద్ర 1984లో లోక్ సభ సభ్యుడు కాదు. ఆయన 1984 ఏర్పిల్ లో రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు.

జగన్ లేఖలో పేర్కొన్న అంశం 2

ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో పి. జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు

వాస్తవం 2

పి. జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా అప్పట్లో స్పీకర్ గుర్తించలేదు. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేతగా (సీఎల్పీ) మాత్రమే గుర్తించారు.

అప్పట్లో ఆయన ప్రమాణస్వీకారం కూడా అక్షర క్రమంలో అందరు ఎమ్మెల్యేలతో సమానంగానే ప్రమాణస్వీకారం చేయించారు.

ఇప్పుడు కూడా అలానే చేయొచ్చు. కానీ.. జగన్ కు ప్రత్యేక గౌరవం ఇస్తూ ఆయన్ను మంత్రుల తర్వాత ప్రమాణస్వీకారం చేయించారు.

జగన్ లేఖలో పేర్కొన్న అంశం 3

టీడీపీకి అప్పట్లో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు

వాస్తవం 3

- ఇందిరా గాంధీ హయాంలో 1970 డిసెంబరు 27నుంచి 1977 జూన్ 30 వరకు ప్రతిపక్ష నేత పదవి దక్కలేదు.

- 1984-89 రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా అధికారికంగా ప్రతిపక్ష నేత ఎవరూ లేరు. ఎవరికి మొత్తం స్థానాల్లో పది శాతం సీట్లు ఏ పార్టీకి రాకపోవటమే.

- 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44, 52 ఎంపీలు మాత్రమే గెలుపొందారు.ఈ కారణంగానే మోడీ ప్రభుత్వంలోని పదేళ్లలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరూ లేని పరిస్థితి.

Tags:    

Similar News